Skip to main content

Cold Out Caugh syrup: కోల్డ్‌ అవుట్‌ దగ్గు మందు చాలా ప్రమాదకరం WHO హెచ్చ‌రిక‌!

ఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్‌ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
Cold-Out-Caugh-syrup
Cold Out Caugh syrup

జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్‌ అవుట్‌’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్‌ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైకు చెందిన ఫోర్ట్స్‌ ల్యాబోరేటరీస్‌ కంపెనీ తయారు చేసిన కోల్డ్‌ అవుట్‌ అనే దగ్గు మందును ఇరాక్‌కు చెందిన దాబిలైఫ్‌ ఫార్మాకు విక్రయించింది.

Nepal Floods: నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. ఐదుగురి మృతి

ఈ మందులో డైథిలీన్‌ ఇథలీన్‌ మోతాదుకు మించి ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్‌ఒ గుర్తించింది. కోల్డ్‌ అవుట్‌లో 0.25% డైఇథలీన్‌, 2.1% ఇథలీన్‌ గ్లైకాల్‌లు ఉన్నట్లు తెలిపింది. ఈ  దీని వినియోగం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో సూచించింది చిన్నారులు ఈ మందు తాగితే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఇటీవల భారత్‌లో తయారైన సిరప్‌ గురించి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం.
కాగా గతంలో భారత్‌లో తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల ఉజ్బెకిస్థాన్‌లోని గాంబియాలో 89 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సిరప్‌ను ఉజ్బెకిస్థాన్‌కు సరఫరా చేసిన మరియోన్‌ బయోటెక్‌ అనుమతులను భారత్‌ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకముందు కామెరూన్‌లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన రీమాన్‌ ల్యాబ్స్‌ కూడా సిరప్‌ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. 

World Health Organisation: కృత్రిమ తీపి పదార్థాలు ప్రమాదకరం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Published date : 09 Aug 2023 07:54PM

Photo Stories