Skip to main content

Nepal Floods: నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

నేపాల్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు నేపాల్‌లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. చైన్‌పుర్‌ మున్సిపాలిటీ-4 ప్రాంతంలో హేవా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సూపర్‌ హేవా హైడ్రోపవర్‌ ప్రాజెక్టు వద్ద వరదలు సంభవించి అక్కడ పనిచేసే కార్మికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

UNESCO: యునెస్కోలోకి మళ్లీ అమెరికా.. చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకే..!

చైన్‌పుర్‌, పంచఖపన్‌ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి హేవా నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. దీంతో వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వరదలకు పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే దేశంలో ప్రవేశించిన రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

Memorial Wall: ఐరాసలో అమరవీరులకు స్మారక స్తూపం

Published date : 19 Jun 2023 04:10PM

Photo Stories