Skip to main content

Memorial Wall: ఐరాసలో అమరవీరులకు స్మారక స్తూపం

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన శాంతిదూతల గౌరవార్థం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ‘మెమోరియల్‌ వాల్‌’ (స్మారక స్తూపం) నెలకొల్పాలని కోరుతూ భారత్‌ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని ఐరాస సాధారణ సభ(యూఎన్‌జీఏ) జూన్ 14న‌ ఆమోదించింది.
Memorial Wall

భారత్‌ ప్రతిపాదన పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ ‘మెమోరియల్‌ వాల్‌ ఫర్‌ ఫాలెన్‌ యునైటెడ్‌ నేషన్స్‌ పీస్‌కీపర్స్‌’ పేరిట ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్, కెనడా, చైనా, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఇండోనేషియా, జోర్డాన్, నేపాల్, రువాండా, అమెరికా తదితర 18 దేశాలు బలపర్చాయి. దాదాపు 190 సభ్యదేశాలు మద్దతిచ్చాయి. ఐరాస శాంతిదళంలో భారత్‌ గణనీయమైన పాత్ర పోషిస్తోంది. 

UNESCO: యునెస్కోలోకి మళ్లీ అమెరికా.. చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకే..!

ప్రస్తుతం భారత్‌ నుంచి 6,000 మందికిపైగా జవాన్లు, పోలీసులు ఈ శాంతిదళంలో పనిచేస్తున్నారు. శాంతిదళంలో పనిచేస్తూ ఇప్పటిదాకా 177 మంది భారత జవాన్లు, పోలీసులు అమరులయ్యారు. ఏ ఇతర దేశానికి చెందినవారూ ఇంతమంది చనిపోలేదు. శాంతిదళానికి జవాన్లు, సైనికులను అందించడంలో భారత్‌ ప్రపంచంలో మూడోస్థానంలో ఉంది. తీర్మానాన్ని ఐరాస సాధారణ సభ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్లలో వాల్‌ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. 

Millionaires: భార‌త్ నుంచి సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకు వెళ్లేందుకు మొగ్గు.. ఎందుకు..?

Published date : 16 Jun 2023 12:35PM

Photo Stories