Skip to main content

Millionaires: భార‌త్ నుంచి సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకు వెళ్లేందుకు మొగ్గు.. ఎందుకు..?

భద్రమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఎంతోమంది భారతీయ సంపన్నులు విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. మెరుగైన శాంతిభద్రతలు, కాలుష్యానికి తావులేని చక్కటి వాతావరణం, సంపదపై తక్కువ పన్నులు వారిని ఆకర్శిస్తున్నాయి.
Millionaires

ఈ ఏడాది భారత్‌ నుంచి 6,500 మంది అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే హెన్లీ ప్రైవేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌–2023 తాజాగా వెల్లడించింది. 2022లో భారత్‌ నుంచి 7,500 మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు అంచనా.  

☛ మిలియన్‌ డాలర్లు(రూ.8.2 కోట్లు), అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద ఉన్నవారిని అల్ట్రా రిచ్‌(హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ)గా పరిగణిస్తారు.  
☛ శాశ్వతంగా స్థిరపడడానికి సంపన్నులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్‌ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.  

World's Biggest Genocides : ఇప్ప‌టి వ‌ర‌కు.. ప్రపంచంలో జ‌రిగిన‌ ఐదు అతిపెద్ద మారణహోమాలు ఇవే..

☛ ఇక 2023లో చైనా, ఇండియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), రష్యా, బ్రెజిల్‌ నుంచి ఎక్కువ మంది ధనవంతులు విదేశాలకు వెళ్తారని అంచనా వేస్తున్నట్లు న్యూ వరల్డ్‌ వెల్త్‌ పరిశోధక సంస్థ చీఫ్‌ ఆండ్రూ ఆమోయిల్స్‌ చెప్పారు.  
☛ భారత్‌ నుంచి మిలియనీర్లు వెళ్లిపోతున్నా పెద్దగా నష్టం లేదని, దేశంలో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు తయారవుతారని ఆమోయిల్స్‌ తెలిపారు.  
☛ ఈ ఏడాది చైనా నుంచి 13,500 మంది ధనికులు వలస వెళ్తారని అంచనా.   
☛ 2022 ఆఖరు నాటికి టాప్‌–10 ధనిక దేశాల జాబితాలో భారత్‌ 10వ స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌ దేశాలు మొదటి 9 స్థానాలో ఉన్నాయి.  
☛ భారత్‌లో మొత్తం జనాభా 142 కోట్లు కాగా, వీరిలో 3,44,600 మంది అల్ట్రా రిచ్‌(మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ అస్తి), 1,078 మంది సెంటి–మిలియనీర్లు(100 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి), 123 మంది బిలియనీర్లు(బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి) ఉన్నారు. 
☛ చైనా జనాభా 141 కోట్లు కాగా, వీరిలో 7,80,000 మంది అల్ట్రా రిచ్, 285 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా జనాభా 34 కోట్లు కాగా, వీరిలో 52,70,000 మంది అల్ట్రా రిచ్, 770 మంది బిలియనీర్లు ఉన్నారు.  

Inspirational Story: అమ్మ కోసం తాజ్‌మహల్ క‌ట్టించిన కొడుకు.. ఫిదా అవుతున్న జనం!

అనువైన దేశం కోసం అన్వేషణ
☛ విదేశాలకు వలస వెళ్లడానికి సంపన్నులు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాజకీయ స్థిరత్వం, తక్కువ పన్నుల విధానం, వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.  
☛ ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు అనువైన దేశం కోసం అన్వేషిస్తున్నారు.
☛ పిల్లలకు నాణ్యమైన చదువులు, వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందాలని కోరుకుంటున్నారు.  
☛ తమ సంపదకు, ఆస్తులకు రక్షణ కల్పించే దేశాన్ని ఎంచుకుంటున్నారు.  
☛ చట్టబద్ధ పాలన ఉండడంతోపాటు ఆర్థిక స్వేచ్ఛకు హామీ ఇచ్చే దేశాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
☛ ప్రైవేట్‌ సంపద వెళ్లిపోవడం దేశాలకు నష్టదాయకమేనని నిపుణులు చెబుతున్నారు.  
☛ భారత్‌లో పన్ను నిబంధనలు కఠినంగా ఉండడంతో ధనవంతులు తమ డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

World Health Organization: ప్రపంచంలోని టాప్‌-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే..!

Published date : 15 Jun 2023 12:18PM

Photo Stories