Xi Jinping: రష్యాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తూ ఏడాది దాటిపోతూ ఉండడంతో ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం చైనా ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో జిన్‌పింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు జిన్ పింగ్ మార్చి 20 నుంచి 22 వరకు మాస్కోలో పర్యటిస్తారు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునీయింగ్ చెప్పారు.
చైనాకు వరసగా మూడోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్ తొలి విదేశీ పర్యటన ఇదే. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన తర్వాత జిన్‌పింగ్ రష్యా పర్యటనకు వెళుతూ ఉండడంతో ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరు దేశాధినేతల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఒత్తిడి పెంచుతున్న అంశాలపై చర్చలు జరుగుతాయని రష్యా ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా, చైనాల స్నేహబంధాన్ని చాటి చెప్పడానికి ఈ సమావేశాన్ని ఇరువురు నేతలు వినియోగించుకోనున్నారు.
Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి