UNGA 76th Session: ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
76వ సెషన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్ 21న ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 27వ తేదీ వరకు జరిగే ఐరాస 76వ సెషన్స్‌కు అధ్యక్షుడిగా అబ్దుల్లా షాహిద్ ఉన్నారు. మాల్దీవులకు చెందిన అబ్దుల్లా షాహిద్ ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా సెప్టెంబర్ 14న బాధ్యతలు చేపట్టారు. ఐరాస తాజా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తొలిసారి ప్రసంగించారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది(2020) సమావేశాలను వర్చువల్ విధానంలో నిర్వహించారు.
బ్రిటన్ నూతన టీకా పాలసీపై భారత్ మండిపాటు
బ్రిటన్ జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉన్నా సరే బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలంటూ బ్రిటన్ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చింది. అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌లిస్టులో పెడతారు. అంటే భారత్‌లో వేస్తున్న టీకాలను బ్రిటన్ గుర్తించదని పేర్కొన్నట్లయింది. ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా మండిపడ్డారు.
చదవండి: కరోనా అసత్య సమాచార వ్యాప్తిలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం?