Covid Misinformation: కరోనా అసత్య సమాచార వ్యాప్తిలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం?
ఈ విషయం సేజెస్ ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. మొత్తం 138 దేశాల్లో పరిశోధన నిర్వహించగా, అందులో భారత్ తొలి స్థానంలో నిలిచిందని జర్నల్ పేర్కొంది. భారత్‌లో ఇంటర్నెట్ విరివిగా అందుబాటులో ఉండటం, అదే సమయంలో ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండటమే దీనికి కారణమని అధ్యయనం అభిప్రాయపడింది.
ఇతర దేశాల్లో..
కరోనా అసత్య సమాచారన్ని ప్రచారం చేసిన దేశాల్లో భారత్ (18.07శాతం), అమెరికా (9.74 శాతం), బ్రెజిల్ (8.57 శాతం), స్పెయిన్ (8.03) టాప్–4లో ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇందులో సోషల్ మీడియాలో (84.94 శాతం), ఇంటర్నెట్‌లో (90.5 శాతం) అసత్య సమాచారాలు పోస్ట్ అయ్యాయని పేర్కొంది. అన్నింటికి మించి ఒక్క ఫేస్‌బుక్‌లోనే (66.87) శాతం అసత్య సమాచారం ప్రచురితమైందని పరిశోధన తేల్చింది.
చదవండి: ఏ కార్యకలాపాలను ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్‌గా పిలుస్తారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనాపై ఇంటర్నెట్ ద్వారా అత్యధిక అసత్య సమాచారం వ్యాపించిన దేశాల జాబితాలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : సేజెస్ ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ జర్నల్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో...
ఎందుకు : భారత్‌లో ఇంటర్నెట్ విరివిగా అందుబాటులో ఉండటం, అదే సమయంలో ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండట వల్ల...