Operation London Bridge: ఏ కార్యకలాపాలను ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్‌గా పిలుస్తారు?
Sakshi Education
బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్–2 మరణించిన అనంతరం తీసుకొనే చర్యల వివరాలు సెప్టెంబర్ 3న లీకయ్యాయి.
రాణి మరణించిన వెంటనే ఆరంభమయ్యే ఈ కార్యకలాపాలను ‘‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్’’గా పిలుస్తారని పొలిటికో వార్తా సంస్థ వెల్లడించింది. రాణి మరణించిన రోజును అధికారికంగా ‘డీ డే’గా పిలుస్తారని, ఆమె మరణించిన రోజును జాతి సంతాపదినంగా ప్రధాని ప్రకటిస్తారని, సెలవు కూడా ఇస్తారని తెలిపింది. బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న రాణిగా ఎలిజబెత్–2 రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమెకు 95 సంవత్సరాల వయసు.
అమెరికాలో ఇదా తుపాను...
అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ‘ఇదా’ తుపాను అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాలలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విలయం ధాటికి న్యూయార్క్ రాష్ట్రంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని సెప్టెంబర్ 2న గవర్నర్ క్యాథీ హోచల్ ప్రకటించారు.
Published date : 04 Sep 2021 06:30PM