Navy Commandos: భారత నేవీ డేరింగ్ ఆపరేషన్.. వారంతా సురక్షితం..
Sakshi Education
సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన కార్గో(వాణిజ్య) నౌక 'ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
వీరందరిని రక్షించినట్లు భారత నావికాదళం జనవరి 5న ఓ ప్రకటన విడుదల చేసింది. నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది.
కాగా లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో (అరేబియన్ సముద్రం) హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్ గురించి వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. జనవరి 4న గుర్తు తెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. ఇందులో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
BRICS: బ్రిక్స్ కూటమిలోకి చేరిన ఐదు దేశాలు ఇవే..
Published date : 06 Jan 2024 03:21PM