World Bank Report on GDP: 2023–24లో ప్రపంచ బ్యాంక్ ప్రకారం భారత్ వృద్ధి ఎంతంటే!
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్ సేవల రంగం పటిష్టంగా ఉంటుందని ఇండియా డెవలప్‌మెంట్ తాజా అక్టోబర్ అవుట్‌లుక్‌లో స్పష్టం చేసింది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం మెజారిటీ వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
GST collection rises in September: సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల
2022–23 భారత్ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, దక్షిణాసియా వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంక్ అంచనావేసింది. ఇతర వర్థమాన మార్కెట్, అభివృద్ధి చెందుతున్న దేశాల ఎకానమీ (ఈఎండీఏ)ల వృద్ధి రేటు 2023–24లో 6.3 శాతం, 2024–25లో 6.4 శాతం నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల ప్రకారం...
- 2023–24లో వ్యవసాయ రంగం 3.5 శాతం పురోగమిస్తుంది. పరిశ్రమల రంగం 5.7 శాతం, సేవల రంగం 7.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయి.
- పెట్టుబడుల్లో వృద్ధి 8.9 శాతంగా ఉంటుంది.
- ప్రభుత్వ చర్యల వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దిగివస్తుంది. ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉంటుందని అంచనా.
- ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు జీడీపీలో లక్ష్యాల మేరకు 6.4 శాతం నుంచి (2022–23లో జీడీపీతో పోల్చి) 5.9 శాతానికి దిగివస్తుంది.
- ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 83 శాతం వద్ద స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వ స్థూల రుణం జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.159.54 లక్షల కోట్లుగా నమోదయ్యింది. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే (రూ.156.08 లక్షల కోట్లు) ఈ పరిమాణం 2.2 శాతం పెరిగింది. మొత్తం రుణాల్లో పబ్లిక్ డెట్ 89.5 శాతంగా ఉంది. భారత్ విదేశీ రుణ భారం జూన్ ముగిసే నాటికి 629.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.52 లక్షల కోట్లు) చేరింది.
- దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ కరెన్సీ అకౌంట్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) జీడీపీలో దేశం భరించగలిగిన స్థాయిలోనే 1.4 శాతంగా ఉంటుంది.
- షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల రుణ నాణ్యత మెరుగుపడుతుంది. అధిక రుణ వృద్ధి, మొండిబకాయిలు తగ్గడం, చక్కటి రికవరీలు, మొండి బకాయిల రైటాఫ్స్ దీనికి కారణం. 2022 మార్చిలో 5.9 శాతంగా ఉన్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల స్థూల మొండిబకాయిల నిష్పత్తి, 2023 మార్చి నాటికి 3.9 శాతానికి తగ్గడం గమనార్హం.
Retail Inflation: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
కొన్ని సంస్థల అంచనా ఇలా.. (వృద్ధి శాతాల్లో)
సంస్థ 2023–24
ఆర్‌బీఐ 6.5
ఎస్‌అండ్‌పీ 6.0
ఫిచ్ 6.3
మూడీస్ 6.1
ఏడీబీ 6.3
ఇండియా రేటింగ్స్ 6.2
ఓఈసీడీ 6.3