Skip to main content

Indian Banking System: బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌ను స్టేబుల్‌కు మార్చిన రేటింగ్‌ ఏజెన్సీ?

Moodys

భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’కు అప్‌గ్రేడ్‌ చేసింది. మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు ఉండడం, ఎకనమీ రికవరీతో రుణ వృద్ధికి అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరంల్లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వరుసగా 9.3 శాతం, 7.9 శాతంగా నమోదవుతుందన్నది తమ అంచనా అని ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్‌ 19న ఒక నివేదికను విడుదల చేసింది.

2021, అక్టోబర్‌ నెల మొదట్లో మూడీస్‌... భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నంచి ‘స్టేబుల్‌’కు మార్చింది. అయితే సావరిన్‌ రేటింగ్‌ను మాత్రం ‘బీఏఏ3’గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. జంక్‌ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచ ఎక్కువ. మూడీస్‌ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉన్న 7 వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీసీ–7) ఉంది.
 

చ‌ద‌వండి: 40 ఏళ్లలోపు సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’కు అప్‌గ్రేడ్‌ చేసిన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్‌ 19
ఎవరు    : అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌
ఎందుకు : మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు ఉండడం, ఎకనమీ రికవరీతో రుణ వృద్ధికి అవకాశాలు ఉండటంతో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Oct 2021 03:35PM

Photo Stories