Hurun india Rich List: 40 ఏళ్లలోపు సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి?
40 ఏళ్లలోపే రూ.1,000 కోట్లకు పైగా సంపదను సమకూర్చుకున్న వ్యాపార విజేతలతో రూపొందించిన ‘ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40, అండర్ సెల్ఫ్‌మేడ్ రిచ్‌లిస్ట్ 2021’ను హురూన్ ఇండియా అక్టోబర్ 13న విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త, మీడియా డాట్ నెట్ వ్యవస్థాపకుడు, 39 ఏళ్ల దివ్యాంక్ తురాఖియా రూ.12,500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత బ్రౌజర్‌స్టాక్ సహ వ్యవస్థాపకులు నకుల్‌అగర్వాల్(38), రితేష్ అరోరా(37)... చెరో రూ.12,400 కోట్ల విలువతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు.
ముఖ్యాంశాలు...
- జాబితాలో మొత్తం 45 వ్యాపారవేత్తలకు స్థానం లభించింది. ఇందులో 42 మంది భారత్‌లో నివసిస్తున్నారు. జాబితాలో 31 మంది కొత్తవారే ఉన్నారు. ఇందులోనూ 30 మంది స్టార్టప్‌లతో సంపద సృష్టించుకున్నారు.
- బెంగళూరు ఎక్కువ మందికి ఆశ్రయమిచ్చింది. జాబితాలో 15 మంది ఈ నగరంలోనే నివసిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ 8 మంది, ముంబై 5, గురుగ్రామ్ 3, థానె ఇద్దరికి చొప్పున నివాస కేంద్రంగా ఉంది.
- సాఫ్ట్‌వేర్ అండ్ సేవలు (12 మంది), రవాణా అండ్ లాజిస్టిక్స్ (5 మంది), రిటైల్ (5 మంది), ఎంటర్‌టైన్‌మెంట్ (5 మంది), ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం నుంచి 5 మంది చొప్పున ఇందులో ఉన్నారు.
- 2021 సెప్టెంబర్ 15 నాటి గణాంకాలను ఈ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నారు.
ర్యాంకు | పేరు | సంపద విలువ (రూ.కోట్లలో) | కంపెనీ |
1 | దివ్యాంక్ తురాఖియా | 12,500 | మీడియాడాట్‌నెట్ |
2 | నకుల్ అగర్వాల్ | 12,400 | బ్రౌజర్‌స్టాక్ |
3 | రితేష్ అరోరా | 12,400 | బ్రౌజర్‌స్టాక్ |
4 | నేహ నర్కెడే, కుటుంబం | 12,200 | కన్‌ఫ్లూయంట్ |
5 | నిఖిల్ కామత్ | 11,100 | జెరోదా |
6 | రిజు రవీంద్రన్ | 8,100 | థింక్‌అండ్‌లెర్న్ |
7 | బిన్నీ బన్సల్ | 8,000 | - |
8 | సచిన్ బన్సల్ | 7,800 | - |
9 | భవీష్ అగర్వాల్ | 7,500 | ఏఎన్‌ఐ టెక్నాలజీస్ |
10 | రితేష్ అగర్వాల్ | 6,300 | ఓర్వెల్‌స్టేస్ |
చదవండి: ఇటీవల మహారత్న హోదా పొందిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40, అండర్ సెల్ఫ్‌మేడ్ రిచ్‌లిస్ట్ 2021లో అగ్రస్థానంలో నిలిచిన వ్యాపారవేత్త?
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : మీడియా డాట్ నెట్ వ్యవస్థాపకుడు, 39 ఏళ్ల దివ్యాంక్ తురాఖియా
ఎందుకు : 40 ఏళ్లలోపు వారిలో అత్యధికంగా రూ.12,500 కోట్లతో సంపదను సమకూర్చుకున్నందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్