Skip to main content

Maharatna Company Status: ఇటీవల మహారత్న హోదా పొందిన సంస్థ?

PFC

విద్యుత్‌ రంగ ఆర్థిక సేవల దిగ్గజం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)కు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా మహారత్న హోదాను ప్రకటించింది. దీంతో ఆర్థిక, నిర్వహణాపరమైన అంశాలలో మరింత స్వేచ్చ లభించనున్నట్లు పీఎస్‌యూ కంపెనీ పీఎఫ్‌సీ పేర్కొంది. 1986లో ఏర్పాటైన పీఎఫ్‌సీ విద్యుత్‌ రంగంలో అతిపెద్ద మౌలిక సదుపాయాల ఫైనాన్స్‌ కంపెనీగా సేవలందిస్తోంది. విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ బోర్డుకు తాజా హోదాతో ఆర్థిక నిర్ణయాలలో మరిన్ని అధికారాలు లభించనున్నాయి. టెక్నాలజీ భాగస్వామ్య సంస్థల ఏర్పాటు, ఇతర వ్యూహాత్మక ఒప్పందాలను సైతం కుదుర్చుకునేందుకు వీలు చిక్కనుంది.

అమెరికా పర్యటనలో మంత్రి నిర్మల...

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికానిలోని బోస్టస్‌లో అక్టోబర్‌ 12న ఫిక్కీ, భారత్‌– అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) నిర్వహించిన ఇన్వెస్టర్ల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

 

యూనికార్న్‌గా మొబిక్విక్‌...

ఫిన్‌టెక్‌ కంపెనీ మొబిక్విక్‌ తాజాగా బిలియన్‌ డాలర్ల(రూ. 7,550 కోట్లు) విలువైన స్టార్టప్‌గా ఆవిర్భవించింది. కంపెనీ ఉద్యోగులు తమకు కేటాయించిన స్టాక్‌ ఆప్షన్ల(ఇసాప్‌లు)ను విక్రయించిన నేపథ్యంలో కంపెనీ యూనికార్న్‌(బిలియన్‌ డాలర్‌ కంపెనీ) హోదాను సాధించినట్లు తెలుస్తోంది.


చ‌ద‌వండి: కేంద్రం అనుమతులు పొందిన కొత్త విమానయాన సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : విద్యుత్‌ రంగ ఆర్థిక సేవల దిగ్గజం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)కు  మహారత్న హోదా ప్రకటన
ఎప్పుడు  : అక్టోబర్‌ 12
ఎవరు    : భారత ఆర్థిక శాఖ
ఎందుకు : ఆర్థిక నిర్ణయాలలో సంస్థకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్

Published date : 13 Oct 2021 04:59PM

Photo Stories