Civil Aviation Ministry: కేంద్రం అనుమతులు పొందిన కొత్త విమానయాన సంస్థ?
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. భారత పౌర విమానయాన శాఖ ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ)’ జారీ చేసినటు అక్టోబర్ 11న కంపెనీ వెల్లడించింది. దీనితో 2022 వేసవి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్ హోల్డింగ్ సంస్థ ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేస్తున్న ఆకాశ ఎయిర్ బోర్డులో ప్రైవేట్ రంగ ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు. కంపెనీ సీఈవోగా నియమితులైన వినయ్ దూబే గతంలో జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. వచ్చే నాలుగేళ్లలో సుమారు 70 విమానాలను ఆపరేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
చదవండి: నార్వే సంస్థ ఆర్‌ఈసీని కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన కొత్త విమానయాన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ఆకాశ ఎయిర్
ఎందుకు : విమాన సర్వీసులను ప్రారంభించే క్రమంలో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్