REC Solar Holdings: నార్వే సంస్థ ఆర్‌ఈసీని కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?
బిలియనీర్ ముకేశ్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్) తొలిసారి ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేసింది. చైనా నేషనల్ బ్లూస్టార్(గ్రూప్) కో నుంచి... ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. నార్వేకు చెందిన ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్‌ఈసీ గ్రూప్)లో 100 శాతం వాటాను 77.1 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,783 కోట్లు) ఎంటర్‌ప్రైజ్ విలువకు కొనుగోలు చేసినట్లు అక్టోబర్ 10న రిలయన్స్ న్యూ ఎనర్జీ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు పూర్తి అనుబంధ సంస్థగా రిలయన్స్ న్యూ ఎనర్జీ ఏర్పడిన సంగతి తెలిసిందే.
కంపెనీ తీరిలా..
నార్వే, సింగపూర్ కేంద్రాలుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించిన ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్‌ఈసీ గ్రూప్)నకు సోలార్ ఎనర్జీలో పట్టుంది. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ కొత్తతరహా సాంకేతిక ఆవిష్కరణలు, అత్యంత మన్నికైన దీర్ఘకాలిక సోలార్ సెల్స్, ప్యానల్స్‌ను రూపొందిస్తోంది.
చదవండి: ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నార్వేకు చెందిన ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్‌ఈసీ గ్రూప్)ను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్)
ఎందుకు : రిలయన్స్ న్యూ ఎనర్జీ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్