Skip to main content

India Post Payments Bank: ఐపీపీబీకు ఎన్ని కోట్ల అదనపు నిధులను కేటాయించారు?

India Post Payments Bank

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)కు రూ. 820 కోట్ల అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఏప్రిల్‌ 27న ఆమోదముద్ర వేసింది. దేశంలోని అన్ని పోస్టాఫీసులకు తన సేవలను విస్తరించేందుకు ఐపీపీబీ ఈ నిధులను వినియోగించుకుంటుంది. 1.56 లక్షల పోస్టాఫీసులలో ఐపీపీబీ ప్రస్తుతం 1.3 లక్షల పోస్టాఫీసుల నుంచి పనిచేస్తోంది. రెగ్యులేటరీ అవసరాలు, సాంకేతిక అప్‌గ్రేడేషన్‌ల కోసం ఐపీపీబీకి మరో రూ.500 కోట్ల కేటాయింపులకు కేబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

GK Persons Quiz: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కొత్త కమాండెంట్‌?

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ)ని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో 2018, సెప్టెంబర్‌ 1న ప్రారంభించారు. బ్యాంకింగ్‌ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌లతో ఐపీపీబీ ని ప్రారంభించారు. ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి.Digital India: డీఐఆర్‌–వీ ప్రోగ్రామ్‌ ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి      :
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)కు రూ. 820 కోట్ల అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్‌ 27​​​​​​​
ఎవరు     : కేంద్ర కేబినెట్‌ 
ఎందుకు : దేశంలోని అన్ని పోస్టాఫీసులకు ఐపీపీబీ సేవలను విస్తరించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Apr 2022 04:57PM

Photo Stories