Digital India: డీఐఆర్–వీ ప్రోగ్రామ్ ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశం?
తొలిసారిగా దేశీయంగా తయారు చేసే సెమీకండక్టర్లను (చిప్ సెట్‌లు) 2023–24 నాటి కల్లా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ–వీ (డీఐఆర్–వీ) ప్రోగ్రామ్‌ను ఏప్రిల్ 27న న్యూఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రధానంగా మొబిలిటీ, కంప్యూటింగ్, డిజిటైజేషన్‌కు అవసరమైన మైక్రోప్రాసెసర్ల ఆవిష్కరణకు ఊతమివ్వడానికి డీఐఆర్–వీ ప్రోగ్రామ్ దోహదపడగలదని మంత్రి వివరించారు. డీఐఆర్–వీకి చీఫ్ ఆర్కిటెక్ట్‌గా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి, ప్రోగ్రామ్ మేనేజర్‌గా సీడాక్ త్రివేండ్రం శాస్త్రవేత్త కృష్ణకుమార్ రావు నియమితులైనట్లు తెలిపారు. దేశంలో సెమీకండక్టర్ తయారీ వ్యవస్థను ప్రోత్సహించేందుకు రూ.76,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా డీఐఆర్–వీని రూపొందించారు.
Market Capitalization: రూ. 19 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ సంస్థ?
GK Awards Quiz: 2022 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ (IWOC) అవార్డుకు ఎంపికైనది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ–వీ (డీఐఆర్–వీ) ప్రోగ్రామ్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : మొబిలిటీ, కంప్యూటింగ్, డిజిటైజేషన్‌కు అవసరమైన మైక్రోప్రాసెసర్ల ఆవిష్కరణకు ఊతమివ్వడానికి..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్