Market Capitalization: రూ. 19 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ సంస్థ?
ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ జోరు చూపుతోంది. తాజాగా ఏప్రిల్ 27న ట్రేడింగ్‌లో తొలుత 1.9 శాతం పుంజుకుంది. కొత్త గరిష్టం రూ. 2,827ను తాకింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. 19 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి రూ. 19,12,814 కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ దిగ్గజంగా ఆర్‌ఐఎల్ చరిత్ర సృష్టించింది. చివరికి రూ. 2,778 వద్ద షేరు ముగియడంతో మార్కెట్ విలువ రూ. 18,79,237 కోట్ల వద్ద స్థిరపడింది.
ISRO: న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?Cement Supply: దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా ప్రారంభించిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ. 19,12,814 కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న తొలి దేశీ దిగ్గజం?
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎందుకు : రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ తాజాగా 1.9 శాతం పెరిగిన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్