India's Billionaire Club: 2022లో బిలియనీర్ క్లబ్ నుంచి 22 మంది అవుట్
ఒక్క అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి 2022ను జాక్‌పాట్ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశ కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి, దేశంలోనే అత్యంత ఐశ్వర్యమంతుడిగా మొదటి స్థానానికి చేరుకోవడమే కాదు.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎగబాకారు. 2021 చివరికి అదానీ నెట్‌వర్త్ (సంపద విలువ) 80 బిలియన్ డాలర్లు ఉండగా, ఏడాది తిరిగేసరికి 70 శాతం పెరిగి 135.7 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూంబర్గ్ గణాంకాల ప్రకారం ఆసియాలోనూ అదానీయే నంబర్ 1గా ఉన్నారు. డాలర్ మారకంలో బిలియనీర్ ప్రమోటర్ల సంఖ్య ఈ ఏడాది 120కి తగ్గింది.
PAN Card: ఆధార్ లింక్ లేని పాన్‌కార్డు వేస్ట్
2021 చివరికి వీరి సంఖ్య 142గా ఉంది. అయితే 24 మంది ప్రమోటర్లు బిలియనీర్ క్లబ్‌లో స్థానం కోల్పోగా.. కొత్తగా ఐఐఎఫ్‌ఎల్ ప్రమోటర్లు ఇద్దరు ఉమ్మడిగా, క్యాప్రిగ్లోబల్ ప్రమోటర్ ఇందులోకి వచ్చి చేరారు. బిలియనీర్ల ఉమ్మడి సంపద సైతం ఈ ఏడాది కొంత కరిగిపోయింది. 8.8 శాతం క్షీణించి 685 బిలియన్ డాలర్లకు (రూ.56.62 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 చివరికి వీరి ఉమ్మడి సంపద విలువ 751.6 బిలియన్ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దేశంలోని టాప్–10 సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఈ ఏడాది గౌతమ్ అదానీతోపాటు, సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి, భారతీ ఎయిర్‌టెల్ సునీల్ భారతీ మిట్టల్ మినహా మిగిలిన ఏడుగురి సంపద విలువ క్షీణించింది.
GST: రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం
ముకేశ్ సంపద 102 బిలియన్ డాలర్లు
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్థానచలనం పొందారు. 2021 చివరికి జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, దీన్ని గౌతమ్ అదానీకి కోల్పోయి రెండో స్థానంలోకి వచ్చారు. ముకేశ్ అంబానీ కుటుంబ సంపద విలువ 2.5 శాతం క్షీణించి గతేడాది చివరికి ఉన్న 104.4 బిలియన్ డాలర్ల నుంచి 101.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావాలతో ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు బలహీన పనితీరు చూపించడం, బిలియనీర్ల సంపద తగ్గడానికి గల కారణాల్లో ప్రధానమైనది. టెలికం రంగంలో చిన్నాచితకా కంపెనీలన్నీ మూతపడిపోవడం, చివరికి వొడాఫోన్ ఐడియా సైతం బక్కచిక్కడం, టారిఫ్‌లను గణనీయంగా పెంచడంతో ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ సంపద వృద్ధి చెందింది.