GDP Growth Rate: ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్ వృద్ధి రేటు?
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్).. 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. 2021, అక్టోబర్‌లో 9.5 శాతం అంచనాలను తాజాగా 9 శాతానికి కుదించింది. వ్యాపార, రవాణా కార్యకలాపాలపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావమే వృద్ధి కోతకు కారణమని జనవరి 25న ఐఎంఎఫ్ పేర్కొంది. కోవిడ్ సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ వృద్ధిని నమోదుచేసుకోకపోగా 7.3 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వృద్ధి 4.4 శాతం
ప్రపంచ వృద్ధి రేటు 2021లో 5.9 శాతంగా నమోదయితే, 2022లో 4.4 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ తాజా అంచనా. 2021, అక్టోబర్‌లో వేసిన (4.9 శాతం) అంచనాలకన్నా ఇది అరశాతం తక్కువ.
హైదరాబాద్ నుంచి తొలి కంపెనీ..
ఎంటర్‌ప్రైస్ హెచ్‌ఆర్ టెక్ కంపెనీ డార్విన్‌బాక్స్ రూ.538 కోట్ల నిధులను సమీకరించింది. ఈ డీల్‌తో కంపెనీ విలువ ఒక బిలియన్ డాలర్ (రూ.7,480 కోట్లు) దాటింది. తద్వారా ఈ సంస్థ యూనికార్న్ కంపెనీల జాబితాలో చేరింది. హైదరాబాద్ నుంచి యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి కంపెనీగా స్థానం సంపాదించింది.
చదవండి: 2021లో కొత్తగా ఎన్ని స్టార్టప్స్ నమోదయ్యాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22లో భారత్ వృద్ధి రేటు అంచనాలను 9.5 శాతం నుంచి 9 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు : వ్యాపార, రవాణా కార్యకలాపాలపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్