Skip to main content

India: 2021లో కొత్తగా ఎన్ని స్టార్టప్స్‌ నమోదయ్యాయి?

Startups

2021 ఏడాది భారతదేశ వ్యాప్తంగా కొత్తగా 2,250 స్టార్టప్స్‌ నమోదయ్యాయి. 2020తో పోలిస్తే 600 కంపెనీల దాకా ఎక్కువగా వచ్చి చేరాయి. జనవరి 21న విడుదలైన నాస్కామ్‌–జిన్నోవ్‌ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. నివేదిక ప్రకారం.. 2021లో భారత్‌లోని స్టార్టప్స్‌ రూ.1.78 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. ఇది కోవిడ్‌ ముందస్తు స్థాయితో పోలిస్తే రెండింతలు అధికం. గడిచిన దశాబ్దంలో మొత్తం స్టార్టప్స్‌ పరిశ్రమ ప్రత్యక్షంగా 6.6 లక్షలు, పరోక్షంగా 34.1 లక్షల మందికి ఉపాధి కల్పించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఎడ్‌టెక్, రిటైల్, రిటైల్‌ టెక్, ఫుడ్‌టెక్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, మొబిలిటీ విభాగాలు కొత్త ఉద్యోగ అవకాశాలు అధికంగా కల్పించాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు.. 

  • స్టార్టప్స్‌లోకి వచ్చి చేరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో యూఎస్‌ ముందు వరుసలో ఉంది.
  • యూకే, యూఎస్, ఇజ్రాయిల్, చైనాతో పోలిస్తే భారతీయ స్టార్టప్‌ వ్యవస్థకు 2021 అత్యుత్తమ సంవత్సరంగా నిలుస్తుంది. 
  • మొత్తం స్టార్టప్స్‌లో ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే, హైదరాబాద్, ముంబైల వాటా 71 శాతం.
  • కనీసం ఒక మహిళ ఫౌండర్‌ లేదా కో–ఫౌండర్‌గా 12–15 శాతం స్టార్టప్స్, 10 యునికార్న్‌ సంస్థలు ఉన్నాయి. దేశంలో ఉన్న 70 యునికార్న్‌ కంపెనీల్లో 42 2021 ఏడాది అవతరించాయి.

చ‌ద‌వండి: ఓలు వర్సిటీతో ఒప్పందంతో చేసుకున్న సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021 ఏడాది కొత్తగా 2,250 స్టార్టప్స్‌ నమోదయ్యాయి.
ఎప్పుడు : జనవరి 21
ఎవరు    : నాస్కామ్‌–జిన్నోవ్‌ నివేదిక
ఎక్కడ    : భారతదేశ వ్యాప్తంగా..
ఎందుకు : దేశంలో స్టార్టప్‌ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న క్రమంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Jan 2022 05:04PM

Photo Stories