6G Research: ఓలు వర్సిటీతో ఒప్పందంతో చేసుకున్న సంస్థ?
రిలయన్స్ జియోకు చెందిన జియో ఈస్తోనియా, ఫిన్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఓలు.. 6జీ టెక్నాలజీ విషయంలో పరస్పర సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో తమ 5జీ సామర్థ్యాలు మరింత పెరగడంతోపాటు, 6జీకి సంబంధించి వినియోగ అవకాశాల అన్వేషణకు వీలు కలుగుతుందని జనవరి 20న జియో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలో తొలి 6జీ పరిశోధన కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఓలు యూనివర్సిటీ.. 6జీకి సంబంధించి వైర్‌లెస్ కమ్యూనికేషన్‌పై దృష్టి సారించిందని ఓలు యనివర్సిటీ 6జీ ఫ్లాగ్‌షిప్ ప్రొఫెసర్ మట్టి లాత్వ పేర్కొన్నారు.
స్వర్ణిమ్ భారత్ కే ఓర్ ఆవిష్కరణ
వినూత్నమైన ఆలోచనలు, ప్రగతి శీల నిర్ణయాలతో ఎలాంటి వివక్షలకు తావులేని వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘ఆజాదీ కె అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జనవరి 20న ‘స్వర్ణిమ్ భారత్ కే ఓర్’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
చదవండి: బ్రాడ్‌బ్యాండ్ సేవల రంగంలో తొలి స్థానంలో ఉన్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిన్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఓలుతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : రిలయన్స్ జియోకు చెందిన జియో ఈస్తోనియా
ఎందుకు : 6జీ టెక్నాలజీ విషయంలో పరస్పర సహకారం కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్