Skip to main content

Digital Payments: దేశంలో రోజుకు ఎన్ని కోట్ల విలువైన డిజిటల్‌ లవాదేవీలు జరుగుతున్నాయి?

Digital Payments

దేశంలో రోజుకు రూ. 20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లవాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్‌ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటివల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఏప్రిల్‌ 24న మన్‌ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని ఈ విషయాలను వెల్లడించారు. 2022, మార్చిలో యూపీఐ లావాదేవీలు రూ. 10 లక్షల కోట్లను చేరాయని చెప్పారు. చిన్న చిన్న ఆన్‌లైన్‌ పేమెంట్లు భారీ డిజిటల్‌ ఎకానమీ నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయని, ఫిన్‌టెక్‌ స్టార్టప్స్‌ ముందుకు వస్తున్నాయని తెలిపారు.

GK Science & Technology Quiz: చిన్న ఉపగ్రహ ప్ర‌యోగం కోసం ఇస్రో ఏ భూ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది?

యూఏఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్‌ ఒప్పందం
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని రువాయిస్‌ కెమికల్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అబుధాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ (త’జీజ్‌) ఏప్రిల్‌ 26న వాటాదారుల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుపై 2 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. క్లోర్‌ ఆల్కలీ, ఎథిలీన్‌ డైక్లోరైడ్‌ తదితర రసాయనాలను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించాయి.

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నారు?
తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. వాటిని ఉక్రెయిన్‌ సమర్థంగా అడ్డుకుంటోందని బ్రిటన్‌ తెలిపింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పర్యటిస్తుండగానే ఆ నగరంపై రష్యా తీవ్ర దాడులకు దిగింది. అక్కడి మిలటరీ ఫ్యాక్టరీపై దాడి చేశామని ప్రకటించింది.

ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌ మృతి
ఉక్రెయిన్‌ సైన్యం కీలకమైన జవానును కోల్పోయింది. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’గా పేరు పొందిన మేజర్‌ స్టెపాన్‌ టారాబాల్కా(29) మార్చి నెలలో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. అతను 40 రష్యా యుద్ధ విమానాలను నేలకూల్చాడని ఉక్రెయిన్‌ చెబుతోంది.

కీలక బిల్లుకు అమెరికా ఆమోదం
ఉక్రెయిన్‌తో పాటు తూర్పు యూరప్‌లోని మిత్రదేశాలకు మరింత సాయం వేగంగా అందించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఏప్రిల్‌ 29న ఆమోదముద్ర వేసింది. దీనికింద రష్యా ఆక్రమణను నిరోధించేందుకు ఈ దేశాలకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తారు.

​​​​​​Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు జెపార్డ్‌ గన్స్‌ పంపుతామని ప్రకటించిన దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Apr 2022 06:14PM

Photo Stories