Skip to main content

CAG Report: కాగ్‌ లెక్కల ప్రకారం.. 2019–20లో రాష్ట్ర వృద్ధి రేటు?

cag report

2019–20 ఆర్ధిక ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికను ప్రభుత్వం నవంబర్ 26న అసెంబ్లీకి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్ర రెవెన్యూ వ్యయం 6.93 శాతం మేర పెరిగింది. తప్పనిసరి ఖర్చులైన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, వడ్డీ చెల్లింపుల వ్యయం అంతకు ముందు ఆర్ధిక ఏడాదితో పోలిస్తే పెరిగాయి. అమ్మఒడి, వైఎస్సార్‌ ఉచిత విద్యుత్, వైఎస్సార్‌ భరోసా వంటి పథకాల అమలుతోపాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో రెవెన్యూ వ్యయం పెరిగింది.

కాగ్‌ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ..

  • 2018–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 8.80 శాతం ఉండగా 2019–20లో 12.73 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ వృద్ధి రేటు 7.21 శాతం కన్నా ఇది ఎక్కువ.
  • 2018–19లో 149.56 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2019–20లో 171.37 లక్షల టన్నులకు పెరగడంతో వ్యవసాయ రంగంలో 16.03 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఉద్యాన, పశు, మత్స్యశాఖల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది.
  • రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రూ.97,123.93 కోట్ల మేర రుణభారం ఉంది. 2020 మార్చి  నాటికి ఆ రుణం పెరిగి రూ.2,15,617 కోట్లకు చేరింది.
  • అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2019–20లో రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర సొంత రాబడులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా బదిలీ రాబడులు తగ్గడం.
  • కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో 2019–20లో రెవెన్యూ ఖర్చులు 6.93 శాతం మేర పెరిగాయి. రెవెన్యూ లోటు 90.24 శాతం పెరిగింది.
  • సాధారణ కేటగిరీ రాష్ట్రాల సగటుతో పోలిస్తే తప్పనిసరి ఖర్చులైన వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, పరిపాలన ఖర్చులు ఏపీలో ఎక్కువ.
  • రాష్ట్ర సొంత పన్నుల రాబడి 0.74 శాతం తగ్గింది. సొంత పన్నేతర రాబడి 24.59 శాతం తగ్గింది
  • కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటా 13.86 శాతం తగ్గింది
  • కేంద్రం నుంచి పొందే గ్రాంట్లు త12.43 శాతం పెరిగాయి.

చ‌ద‌వండి: దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2019–20లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వ్యయం 6.93 శాతం మేర పెరిగింది. 
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు    : కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక
ఎందుకు : అమ్మఒడి, వైఎస్సార్‌ భరోసా వంటి పథకాల అమలుతోపాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో..

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

Published date : 27 Nov 2021 04:40PM

Photo Stories