Skip to main content

ADB raises India growth Rate: భారత్ వృద్ధి 6.7 శాతం..ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ తాజా నివేదిక

భారత్‌ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది.
 ADB forecasts 6.7% growth for India  ADB projects 6.7% growth for India  Asian Development Bank ups India's growth rate to 6.7%   Indian economy forecast
Asian Development Bank ups India's growth rate to 6.7%

ఈ మేరకు సెప్టెంబర్‌ నాటి అవుట్‌లుక్‌ 6.3 శాతం వృద్ధి అంచనాలను 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌) త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి ఫలితాలు అంచనాలకు మించి 7.6 శాతంగా వెలువడ్డం తమ తాజా నిర్ణయానికి కారణమని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌– డిసెంబర్‌ 2023లో వివరించింది.  2022–23లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 

India's Economy: భారత్‌ ఆర్థిక వృద్ధి 6.8 శాతం

2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది.  క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్‌బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ చూస్తే... రియల్‌ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్‌ ఇయర్‌ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది.  

India Economy: ఐదు ట్రిలియన్‌ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

Published date : 15 Dec 2023 01:48PM

Photo Stories