Skip to main content

Daily Current Affairs in Telugu: మార్చి 28, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu March 28th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
March 28th 2023 Current Affairs

Abel Prize: గ‌ణితశాస్త్ర నోబెల్ ప్రైజ్(అబెల్) 2023ను గెలుచుకున్న లూయిస్ కాఫరెల్లి.. 
గ‌ణితశాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌గా బావించే అబెల్ ప్రైజ్‌ను 2023 సంవ‌త్స‌రానికి గాను ఆస్టిన్‌లోని టెక్సాస్ యునివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న లూయీస్ కాఫ‌రెల్లి గెలుచుకున్నారు. ఫ్రీ-బౌండరీ సమస్యలు, మోంగే-ఆంపియర్ సమీకరణంతో పాటు నాన్‌లీనియర్ పాక్షిక అవకలన సమీకరణాల కోసం చేసిన క్రమబద్ధత సిద్ధాంతానికి లూయీస్ ప్రాథమిక సహకారాన్ని అందించారు. ఈ ప్రైజ్‌ను విద్యా మంత్రిత్వ శాఖ తరపున నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ప్రదానం చేస్తుంది. బహుమతిగా 7.5 మిలియన్ క్రోనర్ ద్రవ్య పురస్కారం, ఒక గాజు ఫలకం ఇస్తారు. నార్వేజియన్ కళాకారుడు హెన్రిక్ హౌగన్ దీనిని రూపొందించారు.
2022 సంవత్సరానికి అబెల్ ప్రైజ్‌ను అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు డెన్నిస్ పార్నెల్ సుల్లివన్‌కు ప్రదానం చేసింది. టోపోలాజీకి దాని విస్తృత అర్థం, ముఖ్యంగా బీజగణితం, రేఖాగణిత డైనమిక్ అంశాలలో డెన్నిస్ చేసిన అద్భుతమైన రచనలకు గాను ఈ అవార్డు ఇవ్వబడింది.

Oscar Winner List 2023: ఆస్కార్ అవార్డుల విజేతల జాబితా ఇదే.. భార‌త్‌కు రెండు ఆస్కార్‌లు

Cheetah Sasha: అయ్యో.. నమీబియా నుంచి వచ్చిన ఆడ చీతా సాషా మృతి
మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి మార్చి 27న మృతి చెందింది. ఐదున్నరేళ్ల వయసున్న సాషా అనే ఆడ చీతా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జనవరిలో అది అనారోగ్యం బారినపడింది. రాష్ట్ర వైద్య బృందానికి తోడు నమీబియా డాక్టర్లనూ రప్పించారు. అది డీహైడ్రేషన్‌తో పాటు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. కోలుకున్నట్టే కనిపించినా హఠాత్తుగా మరణించింది.
చీతాల్లో కిడ్నీ వ్యాధులు మామూలే
సాషాతో సహా మొత్తం 8 చీతాలను 2022 సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తెప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీటిని స్వయంగా కునో పార్కులోకి వదిలారు. అక్కడి వాతావరణానికి అవి బాగానే అలవాటుపడ్డాయి. అయితే చీతాల్లో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు తలెత్తడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చినప్పటి నుంచే సాషా బలహీనంగా ఉందని అటవీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. అన్ని ప్రయత్నాలూ చేశామని, అయినా కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

అరుణాచల్‌ జీ20 సదస్సుకు చైనా గైర్హాజరు..
అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో మార్చి 26న‌ జరిగిన జీ20 సన్నాహక సదస్సుకు చైనా గైర్హాజరైందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిశోధనలు, ఆవిష్కరణల థీమ్‌తో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం జరిపిన ఈ సదస్సుకు చైనా మినహా ఇతర జీ20 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అరుణాచల్‌ తమదని చైనా వాదిస్తుండటం, దాన్ని భారత్‌ తిప్పికొడుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సదస్సుపై అసంతృప్తితోనే చైనా తమ ప్రతినిధులను పంపలేదంటున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ దీన్ని ఖండించారు. 

Padma Awards 2023: ఘ‌నంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులను అందుకున్న తెలుగు ప్రముఖులు

మారనున్న ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌
నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) ప్రకారం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల సిలబస్‌ను సవరించనున్నట్లు కేంద్రం మార్చి 27న‌ పేర్కొంది. కొత్త సిలబస్‌తో పుస్తకాలు డిజిటల్‌ ఫార్మాట్‌లోనూ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఎన్‌ఈపీ–2020 ప్రకారం చిన్నారులు ప్రాథమిక దశలో ఐదేళ్లు, సన్నద్ధత, మధ్య దశల్లో మూడేసి ఏళ్లు, సెకండరీ స్టేజీలో నాలుగేళ్లు గడపాల్సి ఉంటుందన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Economic Growth: 2023–24 భారత్‌ వృద్ధి రేటు.. 6 శాతం!

భారత్‌ ఆర్థిక వృద్ధి ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతంగా ఉంటుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజా నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ రేటు తిరిగి 6.9 శాతానికి చేరుతుందని అంచనా వేసిన రేటింగ్‌ దిగ్గజ సంస్థ– మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఎకానమీ వేగాన్ని 7 శాతంగా ఉద్ఘాటించింది. కాగా, ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) మరింత పెంచే అవకాశం ఉందని కూడా రేటింగ్‌ దిగ్గజం అంచనా వేసింది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి ఎస్‌అండ్‌పీ త్రైమాసిక ఎకనమిక్‌ అప్‌డేట్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

India GDP Growth:2022–23లో వృద్ధి 7 శాతమే!
∙ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.8 శాతంకాగా, 2023–24లో ఈ రేటు 5 శాతానికి తగ్గనుంది.  
∙2024–2026 మధ్య భారత్‌ ఎకానమీ వృద్ధి తీరు సగటున 7 శాతం.   పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి​​​​​​​


Supreme Court: ‘మోసపు ఖాతా’గా ప్రకటించే విషయంలో బ్యాంకింగ్‌కు సుప్రీం సూచన 
ఒక అకౌంట్‌ను మోసపూరితమైనదిగా ప్రకటించేముందు సంబంధిత రుణ గ్రహీత తన వాదనను వినిపించుకునేందుకూ తగిన అవకాశం కల్పించాలని బ్యాంకింగ్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు 2020లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. ఒక ఖాతాను మోసపూరితంగా వర్గీకరించడం వల్ల ఆ నేర విచారణను దర్యాప్తు సంస్థలు చేపట్టడమే కాకుండా, అది ఇతర క్రిమినల్, సివిల్‌ చర్యలకూ దారితీస్తుందన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఖాతాను మోసపూరితమైనదిగా వర్గీకరించే చర్య.. రుణగ్రహీత వ్యాపారం, సద్భావనపై (గుడ్‌విల్‌) మాత్రమే కాకుండా కీర్తి ప్రతిష్టలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది.
సహజ న్యాయ సూత్రాల ప్రకారం రుణగ్రహీతలకు తప్పనిసరిగా నోటీసు అందించాలని, ‘మోసపూరితమైనదిగా ప్రకటించడానికి దారితీస్తున్న పరిస్థితులకు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికలోని తీర్మానాలను వివరించడానికి అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. 'తన అకౌంట్‌ను నేరపూరితమైనదిగా ప్రకటించడం కూడదని రుణగ్రహీత విజ్ఞప్తిచేస్తే, ఆ అభ్యంతరాలను తోసిపుచ్చాల్సిన పరిస్థితుల్లో.. అందుకు సంబంధించి సహేతుకమైన ఉత్తర్వు జారీ చేయవలసి ఉంటుంది' అని బెంచ్‌ స్పష్టం చేసింది. 2016లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (వాణిజ్య బ్యాంకులు, నిర్ధిష్ట ఆర్థిక సంస్థలు మోసాల వర్గీకరణ రిపోర్టింగ్‌) ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన అభ్యర్ధనలపై సుప్రీం తాజా తీర్పు వెలువరించింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Table Tennis Senior Nationals: జాతీయ టీటీ చాంపియన్‌షిప్‌లో శ్రీజ ‘ట్రిపుల్‌’ ధమాకా
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో మూడు విభాగాల్లో టైటిల్స్‌ సొంతం చేసుకుంది. మార్చి 27న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున పోటీపడిన శ్రీజ మహిళల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ నిలబెట్టుకోగా.. డబుల్స్‌ విభాగంలో తన భాగస్వామి దియా చిటాలెతో కలిసి విజేతగా నిలిచింది. మహిళల టీమ్‌ ఈవెంట్‌లో శ్రీజ, దియా, అహిక ముఖర్జీలతో కూడిన ఆర్‌బీఐ జట్టు టైటిల్‌ సాధించింది. 
☛ సింగిల్స్‌ ఫైనల్లో శ్రీజ 9–11, 14–12, 11–7, 13–11, 6–11, 12–10తో సుతీర్థ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్‌)పై గెలిచి రూ. 2 లక్షల 75 వేల ప్రైజ్‌మనీని దక్కించుకుంది. 
☛ డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–దియా ద్వయం 11–7, 11–7, 8–11, 14–12తో స్వస్తిక ఘోష్‌–శ్రుతి అమృతే (మహారాష్ట్ర) జోడీని ఓడించింది. 
☛ టీమ్‌ ఫైనల్లో ఆర్‌బీఐ 3–2తో తమిళనాడును ఓడించింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో మొహమ్మద్‌ అలీ–వంశ్‌ సింఘాల్‌ (తెలంగాణ) జోడీ 6–11, 7–11, 6–11తో జీత్‌ చంద్ర–అంకుర్‌ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్‌) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.  

Shooting World Cup: ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌కు రెండో స్థానం

EPFO: పీఎఫ్‌(PF) వడ్డీరేటు పెంచిన కేంద్రం.. ఎంత శాతం పెంచిందంటే?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేటు వర్తించనుంది. గతంలో 8.10 శాతంగా ఉన్న పీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతానికి చేర్చింది. కాగా ఇది 2022-23 పీఎఫ్ డిపాజిట్లపై వర్తిస్తుంది. పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న నగదు నిల్వపై ఈ వడ్డీ జమ కానుంది. ఈ మేరకు మార్చి 27,28 తేదీల్లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు. అయితే ఇప్పుడు మరో 0.05 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రెండు రోజుల సమావేశం అనంత‌రం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీలో 0.05% పెంచాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు. 

సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన అనంత‌రం వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత వడ్డీ రేటు అధికారికంగా ప్రభుత్వ గెజిట్‌ విడుదల అవుతుంది. అనంతరం ఈపీఎఫ్‌ఓ ​​తన చందాదారుల ఖాతాల్లో వడ్డీ రేటును జమ చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఆదాయం మొత్తంలో వృద్ధి వరుసగా 16%, 15% కంటే ఎక్కువ అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

DA for Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. 
పాన్‌తో ఆధార్‌ను అనుసంధానానికి సంబంధించిన గడువును కేంద్రం  మరోసారి పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలలు పెంచుతూ జూన్‌ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ అధికారికంగా ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా  పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపుపై కేంద్రం ఆర్ధిక శాఖ స్పందించింది. జూన్‌ 30, 2023 లోపు  పాన్‌ -ఆధార్‌ అనుసంధానం చేయాలని, లేదంటే పాన్‌ కార్డ్‌ పని చేయదని స్పష్టం చేసింది. పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేయాలి. 
☛ అంతేకాదు పాన్‌ కార్డ్‌ నిరుపయోగమైతే చెల్లింపులు నిలిచిపోతాయి.  
☛ పాన్‌ కార్డ్‌ పని చేయని కాలానికి వడ్డీలు పొందలేరు.  
☛ చట్టం ప్రకారం.. టీడీఎస్‌, టీసీఎస్‌లు ఎక్కువ రేటుతో తొలగించడం/సేకరించడం జరుగుతుంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 28 Mar 2023 07:01PM

Photo Stories