Padma Awards 2023: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులను అందుకున్న తెలుగు ప్రముఖులు
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 106 మందికి జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. మార్చి 22న తొలి విడత ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా పలువురికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందజేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణకు పద్మవిభూషణ్ అందజేశారు. కుమార మంగళం బిర్లా (ట్రేడ్ ఇండస్ట్రీ), సుమన్ కల్యాణ్‌పూర్ (ఆర్ట్), కపిల్ కపూర్ (లిటరేచర్, ఎడ్యుకేషన్), ధ్యాన గురువు కమలేష్ డి పటేల్ (ఆధ్యాత్మికం) పద్మభూషణ్ అందుకున్నారు.
పద్మశ్రీ విభాగంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్ మోదదుగు విజయగుప్త(సైన్స్, ఇంజనీరింగ్, తెలంగాణ) పుసుపులేటి హనుమంతరావు(చికిత్స పీడియాట్రిక్స్, తెలంగాణ), బండి రామకృష్ణారెడ్డి (లిటరేచర్, ఎడ్యుకేషన్–తెలంగాణ), సంకురాత్రి చంద్రశేఖర్ (సమాజసేవ, ఆంధ్రప్రదేశ్), చింతపాటి వెంకటపతి రాజు (కళ, ఆంధ్రప్రదేశ్), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ, హరికథ– ఆంధ్రప్రదేశ్), ప్రొఫెసర్ ప్రకాశ్ చంద్ర సూద్ (సాహిత్యం– ఆంధ్రప్రదేశ్) పద్మశ్రీ అందుకున్నారు.