Skip to main content

DA for Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం తీపి క‌బురు చెప్పింది.
DA for Govt Employees

డియర్‌నెస్ అలవెన్స్((DA)కరవు భత్యం)ను 4 శాతం పెంచుతూ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. ఈ మేరకు కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. కరవు భత్యం(డీఏ) పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.12,815 కోట్ల భారం పడనున్నట్లు తెలిపారు. 
కాగా డీఏ పెంపు అనేది ఉద్యోగుల కనీస లేదా మూలవేతనాన్ని పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రతి ఉద్యోగి, పెన్షనర్ ఈ డీఏ, డీఆర్‌ను అందుకుంటారు. ఇక డీఏ పెంపుతో ఉద్యోగుల టేక్ హోం శాలరీ పెరగనుంది. అంటే చేతికి అందుకునే వేతనం ఎక్కువవుతుంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 25 Mar 2023 01:14PM

Photo Stories