Daily Current Affairs in Telugu: జనవరి 17th, 2023 కరెంట్ అఫైర్స్
Mukarram Jah Bahadur: 8వ నిజాం ముకరంజా బహదూర్ కన్నుమూత
మక్కా మసీదు ఆవరణలోని అసఫ్‌జాహీ సమాధులవద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు
అనారోగ్యంతో కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్న 8వ నిజాం రాజు మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ (89) జనవరి 14వ తేదీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూశారు. ఆయన భౌతికకాయం జనవరి 17న హైదరాబాద్ చేరుకుంటుందని నిజాం ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. తన అంతిమ సంస్కారాలను హైదరాబాద్ మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల వద్ద నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడే ముకరంజా. 1933 అక్టోబర్ 6న ఫ్రాన్స్‌లో ఆయన జన్మించారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య, లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
1967లో ఎనిమిదవ నిజాంగా..
భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. కాగా, మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమా ధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 17న ముకరంజా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకు వచ్చి, 18న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చౌమహాల్లా ప్యాలెస్‌లో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి ప్రజలను అనుమతించనున్నారు.
Santokh Singh: గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
National Startup Awards 2022: ఉత్తమ ఇంక్యుబేటర్‌గా ‘టీ హబ్’
భారత్‌లో ఆవిష్కరణలకు మూల స్తంభంలా పనిచేస్తున్న ‘టీ హబ్’కు ‘బెస్ట్ ఇంక్యుబేటర్ ఇండియా’అవార్డు లభించింది. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ జనవరి 16న ఢిల్లీలో ‘నేషనల్ స్టార్టప్ అవార్డులు 2022’ను ప్రదానం చేశారు. టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. వివిధ రాష్ట్రాలు అవార్డుల కోసం పోటీ పడగా అవార్డు విజేతల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందిన స్టార్టప్‌లు 33 శాతం విజేతలుగా నిలిచాయి. 17 రంగాల్లో 42 స్టార్టప్‌లు అవార్డులు సాధించగా కర్ణాటక 18, మహారాష్ట్ర 9, ఢిల్లీ 4, గుజరాత్ 3, ఉత్తరాఖండ్ 2, తెలంగాణ, ఒరిస్సా, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, అస్సాం ఒక్కో అవార్డును పొందాయి. జాతీయ స్థాయిలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడగా, టీ హబ్‌కు ఉత్తమ ఇంక్యుబేటర్ అవార్డు దక్కింది. టీ హబ్‌కు అవార్డు రావడంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య ‘వందే భారత్’ రైలు
ఆధునిక రైల్వేకు రూపకల్పన
సికింద్రాబాద్– విశాఖపట్నం మధ్య నడిచే దేశంలో ఎనిమిదో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి ఆయన జెండా ఊపగా, సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యక్షంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో రైల్వేల పురోగతి అద్భుతంగా సాగిందన్నారు. 2014కు ముందు తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో రూ.250 కోట్ల లోపే కేటాయింపు ఉండేదని, ఇప్పుడు అది రూ.3 వేల కోట్లకు పెరిగిందన్నారు. రైలును చూడని మెదక్ లాంటి ప్రాంతాలకు ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ ఏర్పడిందని, ఇది తెలంగాణలో రైల్వేపరంగా పురోగతికి గుర్తని ఆయన వ్యాఖ్యానించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
త్వరలోనే తెలంగాణలోని అన్ని బ్రాడ్ గేజ్ మార్గాల విద్యుదీకరణ
2014కు ముందు ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రాంతంలో కొత్తగా వేసిన రైలు మార్గం 125 కిలో మీటర్ల లోపే ఉండగా, గడిచిన ఎనిమిదేళ్లలో 325 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎనిమిదేళ్లలో ట్రాక్ విస్తరణ పనులు 250 కిలోమీటర్లకు పైగా జరిగాయని, విద్యుదీకరణ పనులు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. త్వరలోనే అన్ని బ్రాడ్ గేజ్ మార్గాల విద్యు దీకరణ పూర్తి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
World Economic Forum: హైదరాబాద్‌లో సీ4ఐఆర్ సెంటర్
జాతీయ, అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్)కు చెందిన సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 16న ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విజయం సాధించింది. ఈ ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. జీవశాస్త్రాలు (లైఫ్ సైన్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత్‌లో సీ4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.
తెలంగాణ అనుకూలతలు, సత్తాకు నిదర్శనం: కేటీఆర్
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు సీ4ఐఆర్ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్ సీ4ఐఆర్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెందే అన్నారు. సీ4ఐఆర్ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఇండియాను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు తెలంగాణ నాయకత్వం వహిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ డాక్టర్ శ్యామ్ బిషెన్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు, రోగుల సౌకర్యాలను మెరుగు పరచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
Water Vision@2047: తొలి జలవనరుల శాఖ మంత్రుల జాతీయ సదస్సు
Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం 72 మంది దుర్మరణం!
నేపాల్‌లో జనవరి 15వ తేదీ జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం చేందారు. కఠ్మాండు నుంచి టూరిస్టు కేంద్రమైన పొఖారా బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండవడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా కుప్పకూలింది. సెతీ నది ఒడ్డున పొఖారాలోని పాత, కొత్త విమానాశ్రయాలకు సరిగ్గా మధ్యలో నేలను తాకుతూనే భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ దారుణంలో అందరూ మరణించినట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా 69 మృతదేహాలను వెలికితీయగా మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. మృతుల్లో ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లతో పాటు ఆ్రస్టేలియా, ఫ్రాన్స్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ నుంచి ఒక్కొక్కరున్నారు. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ 9ఎన్–ఏఎన్‌సీ ఏటీఆర్–72 విమానం 15 ఏళ్ల నాటిది. ఇందులోని ట్రాన్స్‌పాండర్ తదితరాలన్నీ మరీ పాతవని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 పేర్కొంది.
Covid Deaths: చైనాలో 35 రోజుల్లో.. 60 వేల కరోనా మరణాలు
భర్త బాటలోనే...
విమాన ప్రమాదంలో కో పైలట్ అంజూ ఖతీవాడా కూడా మరణించినట్టు భావిస్తున్నారు. ఆమె మృతదేహం ఇంకా దొరకాల్సి ఉంది. అంజూ భర్త పైలట్ దీపక్ పోఖ్రియాల్ కూడా విమాన ప్రమాదంలోనే మరణించారు. 16 ఏళ్ల కింద ఆయన నడుపుతున్న యతి ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురై మరణించారు. అయినా వెరవక భర్త తాలూకు బీమా మొత్తంతో అమెరికాలో ఏవియేషన్ కోర్సు చేసి అంజూ కో పైలట్ అయింది. జనవరి 15 ప్రయాణం ముగిస్తే ఆమె పైలట్‌గా పదోన్నతి పొందేది!
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Karnataka Elections 2023: గృహిణులకు నెలకు రూ.2 వేలు
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే గృహిణులకు నెలకు రూ.2 వేలు చొప్పున అందజేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. జనవరి 16న బెంగళూరులో మహిళల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గృహ లక్ష్మి యోజన పథకంలో భాగంగా ఏడాదికి రూ.24 వేలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. కోటిన్నర మందికి దీంతో లబ్ధి కలుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలకు ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫోస్టో విడుదల చేస్తామన్నారు. కర్నాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
MV Ganga Vilas: సుదీర్ఘ నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’ ప్రారంభం
Oxfam International: 1 శాతం మంది గుప్పిట్లో.. 40% దేశ సంపద!
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు. ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట. మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు జనవరి 16వ తేదీ ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి..
ఉక్రెయిన్ నగరం డ్నీప్రో నగరంలోని ఓ అపార్టుమెంట్‌పై రష్యా క్షిపణి దాడిలో 40 మంది దుర్మరణం పాలయ్యారు. 75 మంది గాయపడ్డారు. 1,700 మంది ఉంటున్న ఈ భవనంపై జనవరి 14వ తేదీ క్షిపణి దాడి జరిగింది. పౌర నివాసాలే లక్ష్యంగా నేరుగా రష్యా జరిపిన దాడి అమానవీయమని ఈయూ దుయ్యబట్టింది.
World Bank: దిగువబాటన భారత్ వృద్ధి రేటు
Army Day: భారత్ నానాటికీ బలోపేతం
బెంగళూరు ఏఎస్‌సీ సెంటర్‌లో జనవరి 15వ తేదీ 75వ ఆర్మీ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశం ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకు బలోపే తమౌతోందని, 2027 నాటికి ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్దానంలోకి రావడం తథ్యమని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆర్మీ డేను మొదటిసారిగా ఢిల్లీ బయట బెంగళూరులో నిర్వహిస్తున్నామని చెప్పారు.