Skip to main content

Miss Universe 2022: మిస్‌ యూనివర్స్‌గా ఆర్‌బోనీ గాబ్రియల్‌

అమెరికాకు చెందిన ఆర్‌బోనీ గాబ్రియల్‌ మిస్‌ యూనివర్స్‌ 2022 విజేతగా నిలిచింది. అమెరికా లూసియానాలో జరిగిన ఈ పోటీలో దాదాపు 80 మందికి పైగా పోటీ పడ్డారు.
Miss Universe 2022
Miss Universe 2022

విన్నర్‌ గాబ్రియల్‌కు భారత్‌కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు ఈ కిరీటాన్ని బహుకరించారు. కాగా గడిచిన పదేళ్లలో యూఎస్‌ఏకు ఇది తొలి విజయం. ఇప్పటి వరకు తొమ్మిది మంది విశ్వసుందరి టైటిల్‌ను దక్కించుకోగా.. అత్యధిక సార్లు గెలిచిన దేశంగా యూఎస్‌ఏ రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో మిస్‌ వెనిజులా ఆమంద డుడామెల్‌ తొలి రన్నరప్‌గా, మిస్‌ డొమిన్‌కన్‌ రిపబ్లిక్‌ ఆండ్రీనా మార్టినెజ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు.

Mrs World 2022: మిసెస్‌ వరల్డ్‌గా సర్గమ్‌ కౌశల్‌

భారత్‌ తరపున ప్రాతినిథ్యం వహించిన మిస్‌ ఇండియా దివిట రాయ్‌ టాప్‌ 5లో సైతం చోటు దక్కించుకోలేకపోయింది. కేవలం టాప్ 16లో చోటు దక్కించుకొని సరిపెట్టుకుంది.  
విశ్వ సుందరి స్టేజ్‌పై హర్నాజ్‌ రెండు డిఫరెంట్‌ గౌన్లతో మెరిశారు. ఈ స్పెషల్‌ గౌనుపై 1994లో మిస్‌ యూనివర్స్‌గా గెలిచిన సుష్మితా సేన్ ఫోటో ఉండటం విశేషం. కాగా హర్నాజ్‌ సంధు దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను అందించిన విషయం తెలిసందే. 1994లో సుష్మితా సేన్‌, 2000 సంవత్సరంలో లారా దత్తా విశ్వ సుంద‌రిగా నిలిచారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Published date : 16 Jan 2023 01:09PM

Photo Stories