Skip to main content

Mrs World 2022: మిసెస్‌ వరల్డ్‌గా సర్గమ్‌ కౌశల్‌

ముంబైకి చెందిన సర్గమ్‌ కౌశల్‌ మిసెస్‌ వరల్డ్‌ 2022 కిరీటం దక్కించుకున్నారు. డిసెంబ‌ర్ 17న అమెరికాలోని వెస్ట్‌గేట్‌ లాస్‌వెగాస్‌ రిసార్ట్‌ అండ్‌ క్యాసినోలో జరిగిన పోటీల్లో 63 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం తలపడ్డారు.

సర్గమ్‌ విజేతగా నిలవగా మొదటి రన్నరప్‌గా మిసెస్‌ పోలినేసియా, రెండో రన్నరప్‌గా మిసెస్‌ కెనడా నిలిచారు. 2001లో నటి, మోడల్‌ అదితి గోవిత్రికర్‌ మిసెస్‌ వరల్డ్‌ గెలుచుకోగా, 21 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు ఆ గౌరవం దక్కింది. సర్గమ్‌ కౌశల్‌ జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు. మిసెస్‌ వరల్డ్‌ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు.

Weekly Current Affairs (Persons) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Published date : 19 Dec 2022 01:06PM

Photo Stories