Skip to main content

World Bank: దిగువబాటన భారత్‌ వృద్ధి రేటు

భారత్‌ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ కుదించింది.

6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్‌ అప్‌డేట్‌లో తెలిపింది. భారత్‌ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. కాగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్‌ 6.1 శాతంగా అంచనావేసింది.
అంటే వృద్ధి రేటు క్రమంగా దిగువకే పయనిస్తుందన్నది ప్రపంచ బ్యాంక్‌ అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, ఎగుమతులు, పెట్టుబడుల వేగం తగ్గడం తన అంచనాలకు కారణమని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంటోంది. అయితే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో భారత్‌ తొలి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.

Economic Growth: ఈ ఏడాది వృద్ధి 7 శాతమే!

Published date : 12 Jan 2023 04:52PM

Photo Stories