Skip to main content

Daily Current Affairs in Telugu: 2023, జూన్ 16th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 14th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Daily Current Affairs in Telugu
Daily Current Affairs in Telugu

Edible Oil: కేంద్రం కీల‌క‌ నిర్ణయం.. వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు 

రిఫైన్డ్‌ సోయాబీన్, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ జూన్ 15న‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం  తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్‌లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది. 

Wheat To Check Prices: గోధుమ నిల్వలపై పరిమితులు విధించిన కేంద్రం

Anti Conversion Law: మతమార్పిడి నిరోధక చట్టం రద్దు.. ఏ రాష్ట్రంలో అంటే..?

గత బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది.

జూలైలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తెలిపింది.
‘మత మార్పిడి నిరోధక బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. 2022లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జూలై 3 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతాం’ అని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ జూన్ 15న‌ తెలిపారు. సామూహికంగా, తప్పుడుమార్గాల్లో బలవంతంగా చేపట్టే మత మార్పిడులను శిక్షార్హం చేస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో బీజేపీ ప్రభుత్వం చట్టం చేశారు. 

Memorial Wall: ఐరాసలో అమరవీరులకు స్మారక స్తూపం

భారత్‌ ప్రతిపాదన పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ ‘మెమోరియల్‌ వాల్‌ ఫర్‌ ఫాలెన్‌ యునైటెడ్‌ నేషన్స్‌ పీస్‌కీపర్స్‌’ పేరిట ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్, కెనడా, చైనా, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఇండోనేషియా, జోర్డాన్, నేపాల్, రువాండా, అమెరికా తదితర 18 దేశాలు బలపర్చాయి. దాదాపు 190 సభ్యదేశాలు మద్దతిచ్చాయి. ఐరాస శాంతిదళంలో భారత్‌ గణనీయమైన పాత్ర పోషిస్తోంది. 

UNESCO: యునెస్కోలోకి మళ్లీ అమెరికా.. చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకే..!

ప్రస్తుతం భారత్‌ నుంచి 6,000 మందికిపైగా జవాన్లు, పోలీసులు ఈ శాంతిదళంలో పనిచేస్తున్నారు. శాంతిదళంలో పనిచేస్తూ ఇప్పటిదాకా 177 మంది భారత జవాన్లు, పోలీసులు అమరులయ్యారు. ఏ ఇతర దేశానికి చెందినవారూ ఇంతమంది చనిపోలేదు. శాంతిదళానికి జవాన్లు, సైనికులను అందించడంలో భారత్‌ ప్రపంచంలో మూడోస్థానంలో ఉంది. తీర్మానాన్ని ఐరాస సాధారణ సభ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్లలో వాల్‌ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. 

Millionaires: భార‌త్ నుంచి సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకు వెళ్లేందుకు మొగ్గు.. ఎందుకు..?

Cyclone Biparjoy: తీరాన్ని తాకిన భీకర బిపర్‌జోయ్‌.. కఛ్, సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లో కుంభవృష్టి

అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా ప్రచండ వేగంతో సుడులు తిరుగుతూ భీకర గాలులతో పెను భయాలు సృష్టించిన బిపర్‌జోయ్‌ తుపాను ఎట్టకేలకు జూన్ 15న‌ సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది.

దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు ఉన్న తుపాను కేంద్రస్థానం(సైక్లోన్‌ ఐ) సాయంత్రం 4.30 గంటలకు తీరాన్ని తాకగా పూర్తిగా తీరాన్ని దాటి భూభాగం మీదకు రావడానికి ఆరు గంటల సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
తుపాను కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్ట్‌ సమీపంలో తీరం దాటి దాని ప్రతాపం చూపిస్తోంది. ఖఛ్, దేవభూమి ద్వారక, ఓఖా, నలియా, భుజ్, పోర్‌బందర్, కాండ్లా, ఆమ్రేలీ జిల్లాల్లో గురువారం ఉదయం నుంచే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కఛ్‌ జిల్లాలోని జఖౌ, మంద్వీ పట్టణాల్లో పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. నిర్మాణ దశలో ఉన్న చిన్నపాటి ఇళ్లు కూలిపోయాయి. జూన్ 15 రాత్రి ఏడింటికి అందిన సమాచారం మేరకు ఎక్కడా ప్రాణనష్టం లేదని గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘ్వీ చెప్పారు. దేవభూమి ద్వారక జిల్లాలో చెట్టు మీదపడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

Cyclones: ఆయా దేశాల్లో పిల‌వ‌బ‌డే తుఫాన్ల పేర్లు ఇవే.. 

లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు.. 
తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ‘ కఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్‌ జిల్లాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముంపు ప్రాంతాల్లో వరద బీభత్సం ఉండొచ్చు. పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్‌సరఫరా దెబ్బతినే ప్రమాదముంది. దాదాపు 14 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడొచ్చు’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర చెప్పారు. నష్టం జరగొచ్చనే భయంతో ముందస్తుగా సముద్రప్రాంతంలో చమురు అన్వేషణ, నౌకల రాకపోకలు, చేపల వేటను నిలిపేశారు.  

Earth Commission: భూమికి డేంజర్‌ బెల్స్‌.. ప్రతి ఖండంలోనూ.. ఎటు చూసినా రెడ్‌ సిగ్నళ్లే

నష్టం తగ్గించేందుకు.. 
తుపాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంతమేర తగ్గించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ పలు చర్యలు తీసుకుంది. చేపల పడవల్ని దూరంగా లంగరు వేశారు. భారీ నౌకలను సముద్రంలో చాలా సుదూరాలకు పంపేశారు. ఉప్పు కార్మికులు, గర్భిణులుసహా లక్ష మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4,000 భారీ హోర్డింగ్‌లను తొలగించారు. గుజరాత్, మహారాష్ట్రలో 33 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కార్వాల్‌ చెప్పారు. ఎడతెగని వానలకు జలమయమయ్యే ముంపుప్రాంతాల ప్రజలను తరలించేందుకు రబ్బరు బోట్లను సిద్ధంచేశారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు సిబ్బందిని పురమాయించారు. ఉత్తర దిశలో పంజాబ్‌ బఠిందాలో, తూర్పున ఒడిశాలో, దక్షిణాన చెన్నై అరక్కోణంలో ఇలా తుపాను ప్రభావం ఉండే అవకాశమున్న ప్రతీ చోటా వాయుసేన అప్రమత్తంగా ఉన్నారు. 

Greenhouse Gas Emissions: వేగంగా వేడెక్కుతున్న భూమి.. రికార్డు స్థాయికి చేరిన గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలు

American Visa: భార‌తీయుల‌కు గుడ్ న్యూస్‌... ఇక‌పై ఇండియ‌న్ల‌కు మ‌రిన్ని వీసాలు

అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో వీలైనన్ని వీసా దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.

ఈ మేరకు అమెరికా దౌత్య వర్గాలు తీవ్రంగా కృష్టి చేస్తున్నాయని  అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం ప్రకటించారు.  

Visa: స్టూడెంట్స్‌కు షాక్‌... వీసా ఫీజును పెంచేసిన‌ అమెరికా

ప్రధాని  అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే పర్యటనలో దౌత్యం, ఇమ్మిగ్రేషన్ వీసా సమస్యలకు సంబంధించి అమెరికా నుంచి ఇండియా ఏమి ఆశించవచ్చనే ప్రశ్నకు సమాధామిచ్చిన మాథ్యూ మిల్లర్ వీసా సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యత అని, ఇంకా  చేయాల్సింది  చాలా ఉందని కూడా  వ్యాఖ్యానించారు. 

H-1B Visa: ఉద్యోగ కోతల వేళ భారతీయ టెకీలకు శుభవార్త..హెచ్‍-1బీ వీసా ఉన్న వారి భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేయెచ్చు..

భారత్‌తో అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాలకు కీలకమని, ఉమ్మడి లక్ష్యాల దిశగా అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన వీసాలకు సంబంధించి, తమ కాన్సులర్ బృందాలు అనేక వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాయన్నారు. జూన్ 21-24  తేదీల్లో   ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.

Published date : 16 Jun 2023 04:11PM

Photo Stories