Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 12th కరెంట్ అఫైర్స్
50th Chief Justice of India: 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఆయన పేరును సిఫార్సు చేస్తూ సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ అక్టోబర్ 11న ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని, తర్వాత రాష్ట్రపతి ఆమోదం అనంతరం జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియమితులవుతారు. జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. 9న జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణం చేస్తారు. 2024 నవంబర్ 10 దాకా రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది?
ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా చేయడం విశేషం! ఆయన 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు అత్యధిక కాలం సీజేఐగా పని చేశారు. తండ్రీకొడుకులిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ చంద్రచూడ్ న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు. 1959 నవంబర్ 11న జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ప్రభ దంపతులకు మహారాష్ట్రలో జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్‌కానన్‌లో పాఠశాల విద్య, 1979లో ఢిల్లీలో ఆర్థిక, గణిత శాస్తాల్లో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీలో న్యాయ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు. 1986లో హార్వర్డ్‌లో డాక్టరేట్ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ చదివారు. బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందడంతోపాటు సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్విసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు అభినవ్, చింతన్ కూడా లాయర్లే.
Also read: Quiz of The Day (October 11, 2022): సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షం ఏది?
Ujjain: మహాకాల్ కారిడార్‌ను ప్రారంభించిన మోదీ
ప్రధాని మోదీ అక్టోబర్ 11న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ మొదటి దశను ప్రారంభించారు. అనంతరం, ధోతి, గమ్‌చా ధరించి ప్రఖ్యాత మహాకాళేశ్వరాలయం గర్భగుడిలో పూజలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. వలసపాలన సంకెళ్లను తొలగించుకుంటున్నామని, సాంస్కృతిక ప్రాముఖ్యత గల ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ‘ఉజ్జయినిలోని ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. ఉజ్జయిని ప్రతి మూలలో దైవిక శక్తి ప్రసారం అవుతుంది. భారత దేశ శ్రేయస్సు, జ్ఞానం, గౌరవం, సాహిత్యానికి వేలాది సంవత్సరాలుగా ఉజ్జయిని సారథ్యం వహించింది’ అని పేర్కొన్నారు. ‘పునరుద్ధరణతో నవకల్పన వస్తుంది. వలస పాలనలో కోల్పోయిన వాటిని దేశం పునరి్నరి్మస్తోంది, గత కీర్తిని పునరుద్ధరించుకుంటోంది’ అని ప్రధాని చెప్పారు. మహాకాల్ కారిడార్ ప్రాజెక్ట్ ఉజ్జయిని చైతన్యాన్ని పెంచుతుందని అన్నారు. చార్‌ధామ్ యాత్రను ఏడాదంతా జరుపుకునేలా రహదారులను అభివృద్ధి చేశామన్నారు. అంతకుముందు, ఉజ్జయిని చేరుకున్న ప్రధాని మోదీకి కారిడార్ వద్ద సాధువులు, మత పెద్దలు స్వాగతం పలికారు. వారికి నమస్కరించుకుంటూ ఆయన ముందుకు సాగారు. అనంతరం ‘శివలింగం’ నమూనాను రిమోట్ బటన్ నొక్కి ఆవిష్కరించి, మహాకాల్ లోక్‌ను ఆయన జాతికి అంకితం చేశారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 10th కరెంట్ అఫైర్స్
కారిడార్ విశేషాలివీ...
- ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడి మహా కాళి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహాక్షేత్రాలు ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం మాత్రమే.
- మత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహా కాళేశ్వరాలయ అభివృద్ధి కోసం దేశంలోనే పొడవైన మహాకాల్ లోక్ కారిడార్‌కు కేంద్రం శ్రీకారం చుట్టింది.
- కారిడార్ పొడవు 900 మీటర్లు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.856 కోట్లు.
- రూ.351 కోట్లతో తొలి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
- మొత్తం 108 అందమైన పిల్లర్లతో కారిడార్‌ను నిర్మిస్తున్నారు.
- ఈ పిల్లర్లపై శివుని ఆనంద తాండవంతో పాటు మరెన్నో శివపార్వతుల భంగిమలను చెక్కుతున్నారు.
- ప్రధాన ద్వారం నుంచి ఆలయం దాకా 93 శివుని విగ్రహాలతో శివపురాణాన్ని చిత్రించారు. ప్రతి విగ్రహంపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే సంబంధిత సమాచారమంతా వస్తుంది.
- ప్రాజెక్టులో భాగంగా రుద్రసాగర్ వంటి హెరిటేజ్ నిర్మాణాలను కూడా పునరుద్ధరించి సుందరీకరిస్తున్నారు.
- ఆలయాన్ని క్షిప్రా నదితో అనుసంధానించేందుకు 152 భవనాలను సేకరించారు.
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కృత్రిమ మేధ సాయంతో మొత్తంప్రాంతంపై నిరంతర నిఘా ఉంటుంది.
- ఈ క్షేత్రాన్ని ఏటా కోటిన్నరకు పైగా భక్తులు సందర్శిస్తుంటారు. కారిడార్ పూర్తయ్యాక ఈ సంఖ్య రెట్టింపవుతుందని అంచనా.
- కారిడార్ ప్రాజెక్టు స్థానికంగా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించనుంది. దీనివల్ల నగర ఆర్థికానికి కూడా ఊపు లభించనుంది.
- (రిమోట్ నొక్కిశివలింగాకృతిని ఆవిష్కరించడం ద్వారా మహాకాల్ కారిడార్ తొలిదశను జాతికి అంకితంచేస్తున్న మోదీ)
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: BCCI టైటిల్ స్పాన్సర్‌గా Paytm స్థానంలో ఏ కంపెనీ వచ్చింది?
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై క్షిపణుల మోత
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్ వంతెనపై బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా దాడులను రష్యా అక్టోబర్ 11న మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా అక్టోబర్ 10న ఏకంగా 84 క్షిపణులతో విరుచుకుపడటం తెలిసిందే. అక్టోబర్ 11న ఉక్రెయిన్‌లోని మిలటరీ కమాండ్ సెంటర్లు, ఇంధన కేంద్రాలే లక్ష్యంగా భారీ దాడులకు దిగింది. దాంతో జెలెన్‌స్కీ ప్రభుత్వం యూరప్ దేశాలకు విద్యుత్ సరఫరాను నిలిపేయాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాలను ఛేదించే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యా విధ్వంసం సృష్టిస్తోంది. క్షిపణి దాడుల తో లివీవ్ నగరం అల్లాడుతోంది. వేలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. అక్టోబర్ 11న దాడుల్లో 20 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అండగా గగనతల రక్షణ వ్యవస్థలను తరలించడానికి అమెరికా, జర్మనీ అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్టోబర్ 10న జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను పంపుతామని హామీ ఇచ్చారు.
ఫేస్‌బుక్‌పై ఉగ్ర ముద్ర
ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంల మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ కంపెనీని ఉగ్రవాద సంస్థగా రష్యా ప్రకటించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు అది ఊతమిస్తోందని ఆరోపిస్తోంది.
Also read: Global Innovation Index Ranking 2022: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో భారత్‌కు 40 ర్యాంకు
Nitin Gadkari: టయోటా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఈవీ
కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా ఓ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫ్లెక్స్ ఫ్యూయల్–స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను అభివృద్ధి చేయనుంది. బ్యాటరీతోపాటు 100 శాతం ఇథనాల్‌తో ఇది పరుగెడుతుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టును అక్టోబర్ 11న ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ కోసం బ్రెజిల్ నుంచి తెప్పించిన టయోటా కరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయల్–స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ వాహనానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌తోపాటు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైయిన్ పొందుపరిచారు. ఫ్లెక్స్–ఫ్యూయల్ అనుకూల కార్లు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనం లేదా మిశ్రమంతో కూడా నడుస్తాయి. సాధారణంగా పెట్రోల్‌తోపాటు ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం ఉపయోగిస్తారు. 20 నుంచి 100 శాతం వరకు ఇథనాల్‌ను వినియోగించవచ్చు. ఇటువంటి వాహనాలు బ్రెజిల్, యూఎస్‌ఏ, కెనడాలో ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. దేశంలో కాలుష్యం పెద్ద ఆందోళన కలిగిస్తోందని మంత్రి అన్నారు. రవాణా రంగం కాలుష్యానికి దోహదపడుతోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తోపాటు ఇథనాల్, మిథనాల్ వంటి జీవ ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. భారతదేశం అతి తక్కువ సమయంలో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించిందని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. 2025 నాటికి ఇది 20 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also read: FY24 Budget: అక్టోబర్ 10 నుంచి బడ్జెట్ కసరత్తు షురూ..
FY23 GDP growth: భారత్ వృద్ధికి IMF రెండో కోత
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించడం ఇది వరుసగా రెండోసారి. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ అవుట్‌లుక్ విడుదలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)సహా పలు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఆర్థిక, విశ్లేషణా సంస్థలు 2022–23 భారత్ వృద్ధి అంచనాలను కుదిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ప్రపంచంలోనే వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుండడం గమనార్హం. 2021–22లో భారత్ వృద్ధి రేటు 8.2 శాతం. ఐఎంఎఫ్ అక్టోబర్ 11న విడుదల చేసిన వార్షిక ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’లో ఈ విషయాలను వెల్లడించింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిందని విశ్లేషించింది. అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం కూడా ప్రతికూల ప్రభావానికి దారితీస్తోందని వివరించింది.
Also read: Cheque bounce cases: మరో ఖాతా నుంచైనా డెబిట్!
ప్రపంచ వృద్ధి 3.2 శాతమే...
2021లో ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే, 2022లో ఇది 3.2 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2023లో ఈ రేటు మరింతగా 2.7 శాతానికి పడిపోతుందని అవుట్‌లుక్ అంచనావేసింది. 2001 తర్వాత ప్రపంచ వృద్ధి ఈ స్థాయిలో బలహీనపడటం (అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్–19 తీవ్ర స్థాయి కాలాలతో పోల్చితే) ఇదే తొలిసారి. అవుట్‌లుక్ ప్రకారం, అమెరికా జీడీపీ 2022 తొలి భాగంలో క్షీణతలోకి జారింది. 2023లో ఒక శాతం వృద్ధి నమోదుకావచ్చు.
Also read: Digital Economy: డిజిటల్ ఎకానమీని పెంచేందుకు RBI డిజిటల్ రూపాయి ప్రవేశపెట్టనుంది..
WEF లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో డాక్టర్ రెడ్డీస్ ప్లాంటు
గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్ (జీఎల్‌ఎన్)లో కొత్తగా 11 ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సైట్లను చేర్చినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ నుంచి దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) హైదరాబాద్ ప్లాంటు, శ్రీసిటీలోని మాండెలీజ్ ఫ్యాక్టరీ, ఇండోర్‌లోని సిప్లా ప్లాంటు ఉన్నాయి.
Also read: సెప్టెంబర్‌లో GST వసూళ్లు రూ.1.47లక్షల కోట్లు
నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి విప్లవాత్మకమైన సాంకేతికతలను ఉపయోగించడంలో ముందుంటున్న 100 పైగా తయారీ సంస్థలు జీఎల్‌ఎన్‌లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న నాణ్యత ప్రమాణాల అంచనాలను అందుకునేందుకు డీఆర్‌ఎల్ హైదరాబాద్ ప్లాంటు భారీ స్థాయిలో డిజిటలీకరణ చేపట్టినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. తయారీ వ్యయాలను 43 శాతం మేర తగ్గించుకున్నట్లు పేర్కొంది. పాతికేళ్ల హైదరాబాద్ ప్లాంటుకు డిజిటల్ లైట్‌హౌస్ ఫ్యాక్టరీ హోదా దక్కడం గర్వకారణమని డీఆర్‌ఎల్ గ్లోబల్ హెడ్ (తయారీ విభాగం) సంజయ్ శర్మ తెలిపారు.
Also read: S&P Rating : వర్ధమాన దేశాల్లో ‘స్టార్’ భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ ఆటోమేషన్స్ మొదలైన వాటితో శ్రీ సిటీలోని ప్లాంటులో మాండెలీజ్ సంస్థ తయారీ వ్యయాలను 38 శాతం తగ్గించుకుందని, కార్మికుల ఉత్పాదకతను 89 శాతం మేర పెంచుకుందని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. అంతర్జాతీయంగా మాండెలీజ్‌కు ఉన్న ఫ్యాక్టరీలకు ఈ ప్లాంటు ప్రామాణికంగా మారిందని తెలిపింది. లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లోని నాలుగు సంస్థలకు అత్యుత్తమమైన సస్టెయినబిలిటీ లైట్‌హౌస్‌ల హోదా ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.
Also read: Small savings schemes interest rates పెంపు
BCCI: బోర్డు కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. పాత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని సాగనంపేందుకే బోర్డు పెద్దలు నిర్ణయించారు. భారత్ తొలి వన్డే ప్రపంచకప్ (1983) విజేత జట్టు సభ్యుడైన బిన్నీకే బీసీసీఐ పెద్దలు జైకొట్టడంతో అనూహ్యంగా అక్టోబర్ 11న 67 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. కార్యదర్శిగా మళ్లీ జై షా కొనసాగేందుకు రంగం సిద్ధమైంది.
Also read: Adani Group Investments : 10 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP