Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 10th కరెంట్ అఫైర్స్
Child marriages: బాల్య వివాహాల్లో జార్ఖండ్ టాప్
చిన్నతనంలోనే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండకుండానే 5.8% మంది బాలికలకు పెళ్లిళ్లవుతున్నాయి. ఈ విషయంలో దేశవ్యాప్త సరాసరి 1.9% కాగా, కేరళలో 0.0% గా ఉంది. కేంద్ర హోం శాఖ నిర్వహించిన శాంపిల్ సర్వే–2020లో ఈ విషయం వెల్లడైంది. సర్వే వివరాలను రిజి్రస్టార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెల్లడించారు. జార్ఖండ్‌లో బాల్య వివాహాలు పల్లెల్లో 7.3%, పట్టణ ప్రాంతాల్లో 3% జరుగుతున్నాయి. 21 ఏళ్లు రాకుండానే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 21 ఏళ్లు రాకుండా 54.0% మంది యువతులకు మూడుముళ్లు పడుతుండగా, జార్ఖండ్‌లో ఇది 54.6% గా ఉంది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు 29.5% మాత్రమే. జార్ఖండ్ మరో అపప్రథ కూడా మూటగట్టుకుంది. మంత్రాల నెపంతో ఇక్కడ 2015లో 32 హత్యలు చోటుచేసుకోగా 2018లో 18 మంది, 2019, 2020ల్లో 15 మంది చొప్పున హత్యకు గురయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది.
Also read: Quiz of The Day (October 08, 2022): తెహ్రీడ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
Voter Turnout: రాష్ట్రంలో తొలిసారి ఓటర్ టర్నౌట్ యాప్ వినియోగం
ఎన్నికల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు (రియల్ టైమ్‌లో) ప్రకటించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ‘ఓటర్ టర్నౌట్’ పేరుతో అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ను రాష్ట్రంలో తొలిసారిగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో వినియోగించనుంది. సామాన్య ప్రజలు సైతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
యాప్ ఇలా పనిచేస్తుంది...
నియోజకవర్గ ఎన్నికల రిటరి్నంగ్ అధికారి (ఆర్‌ఓ) ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ వివరాలను యాప్ ద్వారా అప్‌లోడ్ చేస్తారు. యాప్‌లో ఎంట్రీల నమోదుకు 30 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. ఉదాహరణకు ఉదయం 9 గంటల్లోగా జరిగిన పోలింగ్ శాతం వివరాలను రిటర్నింగ్ అధికారి ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య నమోదు చేస్తారు.
- ఉదయం 9 గంటలు, 11 గంటలు, మధ్యాహ్నం 1 గంట, 3 గంటలు, సాయంత్రం 5 గంటలు, 7 గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలను ఆ తర్వాతి అర్ధగంటలోగా ప్రకటిస్తారు. తుది పోలింగ్ వివరాలను అర్ధరాత్రి 12 గంటలలోగా విడుదల చేస్తారు.
- పోలింగ్ ముగిసిన తర్వాత పురుషులు, మహిళలు, ఇతర ఓటర్లు ఎంత మంది ఓటేశారు? మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? వంటి వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేసి, ధ్రువీకరించుకున్న తర్వాత సబి్మట్ చేస్తారు.
- అనంతరం సీఈఓ నియోజకవర్గాల వారీగా వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకున్నాక వాటిని ప్రకటిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి సుమారుగా ఇంత పోలింగ్ జరిగిందని యాప్‌లో వివరాలు అందుబాటులోకి వస్తాయి.
Billiards World Championship: పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్
క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్‌లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్‌లలో వివిధ ఫార్మాట్‌లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం.
భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో అక్టోబర్ 8న జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం. ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్‌లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్.
Also read: Weekly Current Affairs (National) Bitbank: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని పాఠశాలలను ప్రకటించారు?
పాయింట్ల ఫార్మాట్‌లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022).
లాంగ్ ఫార్మాట్‌లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018).
స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్íÙప్ (2019).
పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014).
Also read: Nobel Prize 2022 : ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..
Raman micro-spectroscopy: తల్లి పాలలోను ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించిన ఇటలీ శాస్త్రవేత్తలు
తల్లిపాలలో ప్లాస్టిక్ చేరినట్టు ఇటలీ వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
పరిశీలన సాగిందిలా..: స్త్రీ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం యూనివర్సిటీ ఆస్పత్రిలో 34 మంది తల్లుల నుంచి నిర్ణీత మొత్తంలో పాల నమూనాలను సేకరించింది. వాటిని రామన్ మైక్రో స్పెక్ట్రోస్కొపీ సాంకేతికత సాయంతో విశ్లేషించింది. ఈ సందర్భంగా 26 మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు. ఆ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఏ రకమైనవి, వాటి పరిణామం, రంగులను నిర్ధారించారు. కొందరి పాలలో అయితే రెండు, మూడు రకాల మైక్రో ప్లాస్టిక్‌లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి, నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఉపయోగంచే ప్లాస్టిక్ రకాలేనని తేల్చారు.
రకరకాలుగా కలుషితం
ఆహారం, కలుషిత గాలి ద్వారా ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి మొదలు.. నిల్వ, రవాణా, వండటం, వడ్డించడం, చివరి ప్లాస్టిక్ చెంచాలతో తినడం వరకు అన్ని స్థాయిల్లో ప్లాస్టిక్ చేరుతోంది. ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతోంది. ఇక ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు గాలిలో చేరుతున్నాయి. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలో ప్రవేశించి శరీర భాగాలన్నింటికీ వెళుతున్నాయి. సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్టు అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తులు నీటిలో కలవడం, వాటి నుంచి అతిచిన్న ముక్కలు నీటిలోకి, జలచరాల్లోకి చేరడం, వాటిని ఆహారంగా తీసుకుంటున్న మన శరీరంలోకి చేరడం జరుగుతోంది. ఇదంతా అత్యంత సూక్ష్మస్థాయిలో ముంచుకొస్తున్న ప్రమాదమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఐదుగురు తల్లి పాల నమూనాల పరిశీలన ఫలితాలివి
వయసు (ఏళ్లలో) | పాల పరిమాణం | మైక్రో ప్లాస్టిక్స్ | రంగు | పాలిమర్ రకం |
28 | 8.44 గ్రా | 2 | నారింజ | నైట్రోసెల్యులోస్ |
32 | 4.92 గ్రా | 1 | నారింజ | పాలీఇథిలిన్ |
32 | 5.83 గ్రా | 1 | నీలి | పాలీఇథిలిన్ |
38 | 5.09 గ్రా | 2 | నలుపు | పాలీవినైల్ క్లోరైడ్ |
36 | 7.08 గ్రా | 2 | ఎరుపు | పాలీవినైల్ క్లోరైడ్ |
ప్రమాదం ఎంత వరకు?
తల్లి పాలలోని ప్లాస్టిక్ అవశేషాలతో బిడ్డకు ప్రమాదం కలగవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని.. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే తల్లి పాలలోని మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై మన దేశంలో ఎలాంటి పరిశోధన జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో కూడా లోతైన పరిశోధనలేవీ లేవని తెలిపింది.
Parliamentary Committee: ఐఐటీల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలుసహా టెక్నికల్, నాన్–టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించాలని అధికార భాషా పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇంగ్లిష్ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు పంపింది.
Also read Global Innovation Index Ranking 2022: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో భారత్‌కు 40 ర్యాంకు
ఇంగ్లిష్‌ను ఐచ్ఛికంగా వాడాలని హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన 11వ నివేదికను ఇటీవలే రాష్ట్రపతికి సమర్పించింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే వాడాలన్న సూచన మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు కమిటీ ఉపాధ్యక్షుడు, బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలి. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి ‘100 శాతం’ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాల యాలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలి. వేరే రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అక్కడి స్థానిక భాషల్లో బోధించాలి. వలస వాసనను వదిలించుకుంటూ విదేశీ భాష ఇంగ్లిష్‌ను కాస్త పక్కనబెట్టాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. ‘ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీలలో పూర్తిగా హిందీలోనే బోధిస్తే మేలు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీస్‌లు, మంత్రిత్వ శాఖల మధ్య లేఖలు, ఫ్యాక్స్‌లు ఈ–మెయిల్‌లలో హిందీ లేదా స్థానిక భాషలను వాడాలి. అధికారిక కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో, ఆహ్వాన పత్రాల్లో సులభంగా ఉండే హిందీ/స్థానిక భాషలనే వాడాలి’ అని సూచించింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్, రాజస్థాన్, ఢిల్లీ ఏ–కేటగిరీలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ బి–కేటగిరీలో ఉన్నాయి. మిగతావి సి –కేటగిరీలో ఉన్నాయి.
Also read : Weekly Current Affairs (Science & Technology) Bitbank: INS విక్రాంత్ అధికారికంగా ఎక్కడ ప్రారంభించబడింది?
Solar village: సంపూర్ణ సౌర గ్రామం మొధెరా
గుజరాత్ రాష్ట్రం మెహసనా జిల్లాలోని మొధెరా గ్రామాన్ని దేశంలోనే మొట్టమొదటి సంపూర్ణ సౌర గ్రామంగా ప్రధాని మోదీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మొధెరాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘సూర్య దేవాలయం ఉన్న గ్రామంగానే మొధెరాకు పేరుంది. ఇప్పుడు సౌర గ్రామంగా కూడా పేరు తెచ్చుకుంటుంది’అని మోదీ అన్నారు. నివాస, ప్రభుత్వ భవనాలపై ఏర్పాటు చేసిన 1,300 రూఫ్‌టాప్ సిస్టమ్స్ ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ 24 గంటలూ నిరంతరాయంగా అందుతుంది. మిగులు విద్యుత్‌ను నిలువ చేసేందుకు బ్యాటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్థానికులు ఉచితంగా కరెంటును వాడుకోడంతోపాటు అదనపు కరెంటును విక్రయించుకుని డబ్బు సంపాదించుకోవచ్చునన్నారు. 21వ శతాబ్దంలో స్వయం సమృద్ధ భారత్ సాధనకు ఇటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రధాని పేర్కొన్నారు.
అనంతరం ఆయన రూ.3,900 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేశారు.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో GST వసూలు చేసింది?
Astana Open trophy: జొకోవిచ్ ఖాతాలో 90వ టైటిల్
సెర్బియా టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ వారం వ్యవధిలో రెండో టైటిల్‌ను సాధించాడు. గతవారం టెల్ అవీవ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ మాజీ నంబర్‌వన్ తాజాగా అస్తానా ఓపెన్ టోర్నీ టైటిల్ నెగ్గాడు. కజకిస్తాన్‌లో అక్టోబర్ 9న జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. ఈ సీజన్‌లో జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్‌కాగా కెరీర్‌లో 90వ టైటిల్. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 3,55,310 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 94 లక్షలు) దక్కింది.
National sports 2022 : కృష్ణ చైతన్య–మహేశ్ జోడీకి స్వర్ణం
జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. అక్టోబర్ 9న జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది.
2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 8th కరెంట్ అఫైర్స్
- 2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్‌తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.
- కనోయింగ్‌లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.
- పురుషుల బాక్సింగ్‌లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.
- అక్టోబర్ 9న జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు.
Japanese GP: వెర్‌స్టాపెన్‌దే ప్రపంచ టైటిల్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. అక్టోబర్ 9న జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో 25 ఏళ్ల వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు.
Also read: Singapore Grand Prix : విజేత పెరెజ్
వెర్‌స్టాపెన్ 3 గంటల 1ని:44.044 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ సీజన్‌లో 12వ విజయాన్ని అందుకున్నాడు.
FY24 Budget: అక్టోబర్ 10 నుంచి బడ్జెట్ కసరత్తు షురూ..
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సానికి (2023–24) సంబంధించిన బడ్జెట్‌పై అక్టోబర్ 10న కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు (ఆర్‌ఈ), రాబోయే సంవత్సరానికి అవసరమైన కేటాయింపులు తదితర అంశాలపై వివిధ శాఖలు, విభాగాలతో సంప్రదింపులతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలి రోజైన అక్టోబర్ 10న అటవీ శాఖ, కార్మిక శాఖ, సమాచార .. ప్రసార శాఖ, గణాంకాల శాఖ, యువజన వ్యవహారాల శాఖ ఆర్‌ఈ సమావేశాలు ఉంటాయి. వివిధ శాఖలతో నెల రోజుల పాటు సాగే సమావేశాలు నవంబర్ 10న ముగుస్తాయి.
సాధారణంగా ఈ సమావేశాలన్నింటికి ఆర్థిక విభాగం, వ్యయాల విభాగం కార్యదర్శులు సారథ్యం వహిస్తారు. ప్రీ–బడ్జెట్ భేటీల తర్వాత 2023–24 బడ్జెట్ అంచనాలను సూచనప్రాయంగా రూపొందిస్తారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే చర్యలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంచనాలు నెలకొన్నాయి.
Cheque bounce cases: మరో ఖాతా నుంచైనా డెబిట్!
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులు దేశంలో భారీగా పెరిగిపోతుండడంపై దీనిని కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో నేరస్తులపై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం, చెక్ జారీ చేసిన అకౌంట్ నుంచే డబ్బు డెబిట్ కావాల్సి ఉంది. అయితే ఈ నిబంధనలను సవరించాలన్న సూచనలు వస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాలు ఈ మేరకు తెలిపిన సమాచారం ప్రకారం, ఇటీవల ఈ సమస్యపై ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణుల నుంచి పలు ప్రతిపాదనలు, సూచనలు అందాయి. వీటిలో ప్రధానమైనవి చూస్తే...
- చెక్కు జారీ చేసిన వ్యక్తి ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించి అకౌంట్‌లో నిధులు తక్కువగా ఉన్నట్లయితే అతని లేదా ఆమె మరొక ఖాతా నుండి చెక్ అమౌంట్ డెబిట్ చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఒకటి.
- అలాగే నేరస్తులు కొత్త ఖాతాలను తెరవడాన్ని నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు అందాయి.
- చెక్ బౌన్స్‌ను రుణ డిఫాల్ట్‌గా పరిగణించడం, నేరస్తుని స్కోర్‌ను అవసరమైనమేర డౌన్‌గ్రేడ్ చేయడం కోసం ఈ సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నివేదించడం కూడా ప్రతిపాదనలో ఉంది. ఈ సూచనలను ఆమోదించే ముందు తగిన చట్టపరమైన సలహాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆయా చర్యలు, బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా చెక్ బౌన్స్ కేసులను సమర్థవంతంగా తగ్గించవచ్చన్నది నిపుణుల సూచన. దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు పెండింగులో ఉన్నాయి.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP