Nobel Prize 2022 : ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి..
అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్‌విగ్‌లకు అక్టోబర్ 10వ తేదీన (సోమవారం) నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై ఈ ముగ్గురి పరిశోధనలకుగాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది.
Nobel Peace Prize for 2022 : ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వీరికే..
ఈ ముగ్గురూ తమ పరిశోధనల్లో..
ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్‌లను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహనను గణనీయంగా మెరుగుపరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైందన్న విషయాన్ని ఈ ముగ్గురూ తమ పరిశోధనల్లో వెల్లడించారు.. బ్యాంకులు దివాళా తీయకుండా ఉండేందుకు ఈ స్టడీ చాలా కీలకమైందని పేర్కొంది.
Nobel Prize 2022 Updates : ఈ సారి ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్.. ఎందుకంటే..?