Skip to main content

Nobel Prize in Literature 2022 : ఈ దేశ‌ రచయితకు సాహిత్యంలో నోబెల్ బహుమ‌తి.. ఈమె ర‌చ‌న‌లు ఎలా ఉంటాయంటే..?

సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ఫ్రెంచ్‌ రచయిత అనీ అర్నాక్స్‌(82)కు లభించింది.
Annie Ernaux
French author Annie Ernaux wins 2022 Nobel Prize for Literature

అనీ అర్నాక్స్‌ పేరును నోబెల్‌ కమిటీ ప్రకటించింది. జెండ‌ర్‌, లాంగ్వేజ్‌, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాల‌పై చాలా స్ప‌ష్ట‌మైన రీతిలో ఎర్నాక్స్ అనేక ర‌చ‌న‌ల్లో త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసినందుకు గానూ నోబెల్‌ బహుమతి వరించింది.

Nobel Prize 2022 Updates : ఈ సారి ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్‌.. ఎందుకంటే..?

French author Annie Ernaux

సుమారు 30కి పైగా సాహిత్య ర‌చ‌న‌లు చేశారు అర్నాక్స్‌. 1940లో ఆమె నార్మాండీలోని యెవ‌టోట్‌లో జ‌న్మించారు.చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ ర‌చ‌న‌లు చేస్తున్నారు. నోబెల్‌ బహుమతి ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడారు అర్నాక్స్‌. ‘ఇది నాకు చాలా పెద్ద గౌరవం. అలాగే.. గొప్ప బాధ్యత, నాకు లభించిన బాధ్యత. ర‌చ‌న అంటే ఓ రాజ‌కీయ చ‌ర్య, సామాజిక అస‌మాన‌త‌ల‌పై దృష్టి పెట్ట‌డ‌మే.’ అని పేర్కొన్నారు.

 Annie Ernaux

ఈ సందర్భంగా.. స‌మాజ ర‌చ‌న‌ల‌పై భాష‌ను ఆమె ఓ క‌త్తిలా వాడుతున్న‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. స‌మాజ రుగ్మ‌త‌ల‌ను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగ‌డ‌తో ర‌చ‌న‌లు చేస్తున్న‌ట్లు క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది.

ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్​కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్​'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. 

Nobel Prize : ఈ సారి వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి ఈయ‌న‌కే.. 40 ఏళ్ల కిందట తండ్రికి.. ఇప్పుడేమో కొడుకు !

రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.

డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు..
నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.

68th national film awards : 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్ర‌దానం.. ఈ సారి తెలుగు సినిమాల‌కు కీరిటం..

 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP :
 

Sakshi Education Mobile App

Published date : 07 Oct 2022 12:01PM

Photo Stories