Nobel Prize 2022 Updates : ఈ సారి ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్.. ఎందుకంటే..?
భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లౌజర్, ఆంటోన్ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్ దక్కింది.
ఈ పరిశోధలకుగానూ.. నోబెల్
చిక్కుబడ్డ ఫోటాన్‌లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది.
ఈ ముగ్గురు..
ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెయిన్ ఆస్పెక్ట్ కాగా.. జాన్ ఎఫ్. క్లౌజర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇక ఆంటోన్ జెయిలింగర్ ఆస్ట్రియాకు చెందిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త. చిక్కుకుపోయిన క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహించారు ఈ ముగ్గురు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ ముగ్గురి సాధన ఫలితాలు.. క్వాంటం సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి అని నోబెల్ కమిటీ ప్రకటించింది.
‘పరమాణువు నుంచి గ్రహాల ప్రమాణాల వరకు భౌతిక వ్యవస్థలలో హెచ్చుతగ్గుల పరస్పర చర్యలపై పరిశోధనలకు జార్జియోకు నోబెల్ బహుమతి లభించింది. ఈ ముగ్గురు విశేష పరిశోధనలు చేస్తున్నారని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రశసించింది.
☛ కిందటి ఏడాది కూడా ఫిజిక్స్‌లో ముగ్గురికే సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
☛ 1901 నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో నలుగురు గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడమ్ క్యూరీ(1903), మారియా జియోప్పెర్ట్ మయర్(1963), డొన్నా స్ట్రిక్‌ల్యాండ్(2018), ఆండ్రియా గెజ్(2020) ఈ లిస్ట్‌లో ఉన్నారు.
☛ ఇక ఫిజిక్స్‌లో చిన్నవయసులో నోబెల్ ఘనత అందుకుంది లారెన్స్ బ్రాగ్. కేవలం పాతికేళ్ల వయసుకే ఇతను 1915లో ఫిజిక్స్ నోబెల్ అందుకున్నాడు.
బహుమతిని రెండు సమానా భాగాలు చేసి.. స్యూకురో మనాబే, క్లాస్ హాసెల్‌మన్‌లకు ఒక భాగం.. జార్జియో పారిస్‌కు ఒక భాగం అందజేయనున్నారు. భూ వాతావరణం భౌతిక నమూనా, వైవిధ్యాన్ని లెక్కించడం.. గ్లోబల్ వార్మింగ్‌ను ఖచ్చితంగా అంచనా వేయడానికి స్యూకూరో, క్లాస్ సంయుక్తంగా పరిశోధనలు చేశారు.
‘2021 నోబెల్ గ్రహీత క్లాస్ హాసెల్‌మాస్ శీతోష్ణస్థితి, వాతావరణాన్ని కలిపే ఒక నమూనాను సృష్టించారు. వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రత కార్బన్ డయాక్సైడ్ మానవ ఉద్గారాల వల్ల అని నిరూపించడానికి ఆయన పద్ధతులు ఉపయోగపడ్డాయి’ అని కొనియాడింది. ‘జార్జియో క్రమరహిత సంక్లిష్ట పదార్థాలలో దాగున్న నమూనాలను కనుగొన్నారు.. సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంతానికి అతని ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి’ పేర్కొంది.
జపాన్ సంతతికి చెందిన అమెరికన్ స్యూకురో మనాబే ప్రిన్సిటన్ యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు. జర్మనీకి చెందిన క్లాస్ హాస్సెల్‌మాన్ హంబర్గ్‌లోని మ్యాక్ ప్లాంక్ మెటీరియాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. జార్జియో పారిసి ఇటలీకి చెందిన శాస్త్రవేత్త. బహుమతి కింద బంగారు పతకం, 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (1.14 మిలియన్ డాలర్ల) అందజేస్తారు.
అక్టోబర్ 10వ తేదీ వరకు..ఇలా..
వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 10న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
నోబెల్ బహుమతి ఎందుకు ఇస్తారంటే..?
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెల్సిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP