Skip to main content

Nobel Peace Prize for 2022 : ఈ ఏడాది నోబెల్ శాంతి పుర‌స్కారం వీరికే..

2022 ఏడాదికిగాను నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ఓ వ్య‌క్తితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల‌కు క‌లిపి ఇచ్చారు.
The Nobel Peace Prize 2022
The Nobel Peace Prize for 2022 to one individual and two organisations.

నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. బెలార‌స్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల అడ్వ‌కేట్ అలెస్ బియాలియాస్కీతో పాటు ర‌ష్యాకు చెందిన మాన‌వ హ‌క్కుల సంస్థ‌, ఉక్రెయిన్‌కు చెందిన సివిల్ లిబ‌ర్టీస్‌ మాన‌వ హ‌క్కుల సంస్థ‌ల‌కు ఈ సారి ప్రైజ్ ద‌క్కింది. నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెలిచిన‌వాళ్లు త‌మ స్వ‌దేశాల్లో సివిల్ సొసైటీ త‌ర‌పున పోరాటం చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంత‌రం ప్ర‌శ్నించార‌ని, పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ర‌క్షించిన‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది.

Nobel Prize : ఈ సారి వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి ఈయ‌న‌కే.. 40 ఏళ్ల కిందట తండ్రికి.. ఇప్పుడేమో కొడుకు !

శాంతి, ప్ర‌జాస్వామ్యం కోసం..

యుద్ధ నేరాల‌ను డాక్యుమెంట్ చేయ‌డంలో వాళ్లు అసాధార‌ణ సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపిన‌ట్లు తెలిపింది. శాంతి, ప్ర‌జాస్వామ్యం కోసం శాంతి పుర‌స్కార గ్ర‌హీత‌లు ఎంతో కృషి చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ చెప్పింది.

Nobel Prize 2022 Updates : ఈ సారి ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్‌.. ఎందుకంటే..?

Nobel Prize in Literature 2022 : ఈ దేశ‌ రచయితకు సాహిత్యంలో నోబెల్ బహుమ‌తి.. ఈమె ర‌చ‌న‌లు ఎలా ఉంటాయంటే..?

Published date : 07 Oct 2022 03:30PM

Photo Stories