Adani Group Investments : 10 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లు
ప్రధానంగా పునరుత్పాదక విద్యుత్, డిజిటల్ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ పెట్టుబడుల్లో సింహభాగం (దాదాపు 70 శాతం) వాటా పునరుత్పాదక విద్యుత్‌పైనే ఉండనుంది. సింగపూర్‌లో జరిగిన ఫోర్బ్స్ గ్లోబల్ సీఈవో సదస్సులో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాలు తెలిపారు. ‘గ్రూప్ స్థాయిలో వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టబోతున్నాం. ప్రస్తుతం మాకు 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ పోర్ట్‌ఫోలియో ఉంది. హైబ్రిడ్ విధానంలో దీన్ని మరో 45 గిగావాట్ల మేర పెంచుకోనున్నాం. ఇందుకోసం సింగపూర్‌తో విస్తీర్ణంతో పోలిస్తే 1.4 రెట్లు అధికంగా 1,00,000 హెక్టార్ల స్థలాన్ని వినియోగించుకోబోతున్నాం. అలాగే 3 గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాం. హరిత హైడ్రోజన్‌ను తక్కువ వ్యయాలతో ఉత్పత్తి చేయడమనేది మా లక్ష్యం‘ అని అదానీ పేర్కొన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 26th కరెంట్ అఫైర్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP