FY24 Budget: అక్టోబర్ 10 నుంచి బడ్జెట్ కసరత్తు షురూ..
Sakshi Education
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సానికి (2023–24) సంబంధించిన బడ్జెట్‌పై అక్టోబర్ 10న కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు (ఆర్‌ఈ), రాబోయే సంవత్సరానికి అవసరమైన కేటాయింపులు తదితర అంశాలపై వివిధ శాఖలు, విభాగాలతో సంప్రదింపులతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలి రోజైన అక్టోబర్ 10న అటవీ శాఖ, కార్మిక శాఖ, సమాచార .. ప్రసార శాఖ, గణాంకాల శాఖ, యువజన వ్యవహారాల శాఖ ఆర్‌ఈ సమావేశాలు ఉంటాయి. వివిధ శాఖలతో నెల రోజుల పాటు సాగే సమావేశాలు నవంబర్ 10న ముగుస్తాయి.
సాధారణంగా ఈ సమావేశాలన్నింటికి ఆర్థిక విభాగం, వ్యయాల విభాగం కార్యదర్శులు సారథ్యం వహిస్తారు. ప్రీ–బడ్జెట్ భేటీల తర్వాత 2023–24 బడ్జెట్ అంచనాలను సూచనప్రాయంగా రూపొందిస్తారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే చర్యలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంచనాలు నెలకొన్నాయి.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Oct 2022 06:45PM