Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 25th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu August 25th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu August 25th 2022
Current Affairs in Telugu August 25th 2022

Guinness World Records: మాక్‌ రూథర్‌ఫర్డ్‌ వయసు 17 ఏళ్లు.. ప్రపంచం చుట్టేశాడు.. 
మాక్‌ రూథర్‌ఫర్డ్‌. వయసు 17 ఏళ్లు. బెల్జియం–బ్రిటిష్.. రెండు పౌరసత్వాలు ఉన్నాయి. చిన్న వయసులోనే రెండు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులు సాధించాడు. చిన్న విమానంలో ఒంటరిగా ప్రపంచమంతా చుట్టేశాడు. ఐదు నెలల క్రితం మొదలైన ఈ ప్రయాణం బుధవారం బల్గేరియా రాజధాని సోఫియాలోని ఎయిర్‌ స్ట్రిప్‌లో ముగిసింది. ఎవరూ తోడులేకుండా భూగోళాన్ని చుట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా, మైక్రోలైట్‌ ప్లేన్‌లో ప్రపంచమంతా తిరిగి అత్యంత పిన్నవయస్కుడిగా రెండు రికార్డులు రూథర్‌ఫర్డ్‌ పరమయ్యాయి.   

Also read: FAAN : డాక్టర్‌ సుందరాచారికి అరుదైన గౌరవం

Top 10 నింగిని తాకే నగరాలు

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యాలు కలిగిన నగరం చైనాలోని షెంజెన్‌. 200 మీటర్లు(దాదాపుగా 60 అంతస్తులు) అంతకన్నా ఎక్కువ ఎత్తున్న భవనాలు ఇక్కడ 120 ఉన్నాయట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా(828 మీటర్లు) ఉన్న దుబాయ్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. టాల్‌ బిల్డింగ్స్‌ అండ్‌ అర్బన్‌ హ్యాబిటాట్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన జాబితాలో అత్యధికంగా చైనాలోని నగరాలే ఉన్నాయి. 27వ స్థానంలో ముంబై ఉంది. కోల్‌కతా 199వ స్థానంలో(ఒకే భవనం) ఉంది. షెంజెన్‌కి సంబంధించి మరో విశేషం ఏమిటంటే.. ఇక్కడ 159 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న 162 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఓ 40 భవనాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నారు. 

Also read: Hellfire R9X Missile: 'హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌' అమెరికా రహస్య ఆయుధం.. దీని ప్రత్యేకతలు ఇవే..

Asia Cupలో భారత్‌ కోచ్‌గా VVS లక్ష్మణ్‌

జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు మరో సిరీస్‌ బాధ్యతలు అప్పజెప్పారు. ఆసియా కప్‌ టి20 టోర్నమెంట్‌లో పాల్గొనే టీమిండియా తాత్కాలిక కోచ్‌గా నియమించారు. 

Also read: FTX Crypto Cup: రన్నరప్‌గా భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ R.Praggnanandhaa

World Table Tennis Championships: అండర్‌–13 బాలికల సింగిల్స్‌ విజేత హన్సిని 

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) యూత్‌ కంటెండర్‌ టీటీ టోర్నీలో భారత క్రీడాకారిణులు అదరగొట్టారు. మూడు సింగిల్స్‌ విభాగాల్లో టైటిల్స్‌ గెల్చుకున్నారు. ఈక్వెడార్‌లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన హన్సిని మథన్‌ రాజన్‌ అండర్‌–13 బాలికల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో హన్సిని 11–7, 11–8, 11–7తో మరియానా రోడ్రిగెజ్‌ (ఈక్వెడార్‌)పై గెలిచింది. అండర్‌–19 బాలికల సింగిల్స్‌ విభాగంలో యశస్విని, అండర్‌–17 బాలికల సింగిల్స్‌ విభాగంలో సుహానా సైనీ కూడా టైటిల్స్‌ సాధించారు. 

Also read: ICC : రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌ ఇదే..

IBSF World Under-21 Snooker Championship: రజత పతకం సాధించిన అనుపమ

రొమేనియాలోని బుకారెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అండర్‌–21 మహిళల స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. అంతర్జాతీయ బిలియర్డ్స్‌ స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో భారత క్రీడాకారిణులు అనుపమ రామచంద్రన్‌ రజత పతకం... కీర్తన పాండ్యన్‌ కాంస్య పతకం సాధించారు. ఫైనల్లో అనుపమ 42–82, 57–50, 5–73, 3–65, 35–68తో పంచాయ చనోయ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్లో కీర్తన 18–59, 7–56, 32–71తో పంచాయ చనోయ్‌ చేతిలో ఓడిపోయి కాంస్య పతకం దక్కించుకుంది.   

Also read: FIFA : అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం విధించిన ‘ఫిఫా’.. ఎందుకంటే..?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 25 Aug 2022 06:03PM

Photo Stories