Hellfire R9X Missile: 'హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్' అమెరికా రహస్య ఆయుధం.. దీని ప్రత్యేకతలు ఇవే..
అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదుల్లో ఒకడైన అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా చాకచక్యంగా మట్టుబెట్టింది. ఇందుకోసం ఉపయోగించిన ఆయుధం- 'హెల్‌ఫైర్ ఆర్9ఎక్స్'. అమెరికా రహస్య ఆయుధంగా దాన్ని చెప్పుకోవచ్చు. అమెరికా అమ్ములపొదిలో 'ఏజీఎం-114 హెల్‌ఫైర్' అనే లేజర్‌గైడెడ్ క్షిపణులు ఉన్నాయి. వీటిని గగనతలం నుంచి భూతలంపైకి ప్రయోగిస్తారు. ధ్వని కంటే తక్కువ వేగంతో అవి ప్రయాణిస్తాయి. వార్‌హెడ్, మార్గనిర్దేశక వ్యవస్థ, భౌతిక వేరియేషన్ల ప్రాతిపదికన ఏజీఎం-114 హెల్‌ఫైర్‌లో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో 'హెల్‌ఫైర్‌ఆర్9ఎక్స్'ది ప్రత్యేక స్థానం. పరిసరాల్లో పెద్దగా నష్టం జరగకుండా లక్షిత వ్యక్తులను మాత్రమే హతమార్చేందుకు ఈ రకం క్షిపణులను ఒబామా హయాంలో అభివృద్ధి చేశారు. కరడుగట్టిన ఉగ్ర నాయకులను హతమార్చేందుకు అమెరికా వీటినే వినియోగిస్తోంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP