Daily Current Affairs in Telugu: 17 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. ఏపీలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట వద్ద రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మించనుంది.
2. విద్యా రంగానికి చేసిన సేవలకు కడపలోని సాయిబాబా విద్యాసంస్థల చైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిను మారిషస్ ప్రభుత్వం ‘ఎక్స్‌లెన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్-2023’ అవార్డుకు ఎంపిక చేసింది.
3. డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని 2023 సంవత్సరానికి ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డిని తెలంగాణ సారస్వత పరిషత్తు ఎంపిక చేసింది.
Daily Current Affairs in Telugu: 16 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. న్యూఢిల్లీ తీన్‌మూర్తి భవన్‌లో అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్)ని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (పీఎంఎంల్)గా పేరు మారుస్తూ ఆగస్టు 14న అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
5. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
6. 2021–22 నుంచి 2025–26కు డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
Daily Current Affairs in Telugu: 10 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
7. ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగంలో మోహిత్ కుమార్ పసిడి పతకాన్ని సాధించాడు.
8. జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో బాలికల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ స్వర్ణ పతకాన్ని, గ్రూప్–2 బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సాగి శ్రీనిత్య (తెలంగాణ), గ్రూప్–2 బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మిట్టపల్లి రిత్విక(తెలంగాణ) కాంస్య పతకాలు సాధించారు .
9. ప్రభుత్వరంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)తొలి పూర్తి స్థాయి మహిళా చైర్మన్, ఎండీగా (సీఎండీ) పర్మిందర్ చోప్రా బాధ్యతలు స్వీకరించారు.
Daily Current Affairs in Telugu: 9 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్