Daily Current Affairs in Telugu: 9 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కాగ్ తెలిపింది.
2. గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతినే ప్రాంతాల్లో గ్రోయెన్లు, రివిట్‌మెంట్ నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లంక గ్రామ వాసులకు హామీ ఇచ్చారు.
☛☛ Daily Current Affairs in Telugu: 8 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
3. ఇరాక్‌లో విక్రయిస్తున్న చెన్నైకు చెందిన ఫోర్ట్స్ ల్యాబోరేటరీస్ కంపెనీ తయారు చేసిన కోల్డ్ అవుట్ అనే దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
4. ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్‌మెంట్ ఆఫ్ సోలార్, అ్రల్టామెగా సోలార్ పవర్ ప్రాజెక్టు పథకంలో భాగంగా అనంతపురం(2), కర్నూలు, కడపలో సోలార్‌పార్కులు ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు.
5. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం- August-09
☛☛ Daily Current Affairs in Telugu: 7 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్