Daily Current Affairs in Telugu: 7 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రూ.11 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నమోదు కాగా 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ‘ఎస్‌బీఐ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది.
2. శనిగ్రహం, కుజ గ్రహం, బృహస్పతి, గురుగ్రహంపై పరిశోధనల కోసం ‘నాసా’ 1977 సెప్టెంబర్ 5న వోయేజర్–1, 1977 ఆగస్టు 20న వోయేజర్–2 వ్యోమనౌకలను పంపించింది.
3. ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో కేరళకు చెందిన ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు.
☛☛ Daily Current Affairs in Telugu: 5 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్ స్వామి, పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే స్వర్ణ పతకాలు సాధించారు.ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.
5. జూనియర్ బల్గేరియా ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి రక్ష కందసామి విజేతగా నిలిచింది.
6. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలోని 508 రేల్వే స్టేషన్లను రూ.24,470 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణానికి వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఏపీలోని 18 రైల్వే స్టేషన్లను తెలంగాణలోని 21 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు.
☛☛ Daily Current Affairs in Telugu: 4 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్