Daily Current Affairs in Telugu: 4 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు.
2. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్‌మెంట్) బిల్లు–2023’ మూజువాణి ఓటుతో గురువారం లోక్‌సభలో ఆమోద ముద్రపడింది.
3. దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది.
☛☛ Daily Current Affairs in Telugu: 3 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కపిల్ సోనోవాల్ యూత్ పురుషుల 102 కేజీల విభాగంలో కాంస్యం సాధించాడు.
5. పౌరుల డిజిటల్ హక్కులు, వ్యక్తిగత సమాచార భద్రతకు ఉద్దేశించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లును గురువారం లోక్‌సభలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు.
6. భారత రాష్ట్రపతి, శ్రీమతి ద్రౌపది ముర్ము ఆగస్టు 3న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘ఉన్మేషా’ – అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం, ‘ఉత్కర్ష్’ – జానపద, గిరిజన ప్రదర్శన కళల ఉత్సవాన్ని ప్రారంభించారు.
☛☛ Daily Current Affairs in Telugu: 2 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్