Daily Current Affairs in Telugu: 3 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. డిజిటల్ హెల్త్ అకౌంట్‌ల సృష్టిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌లోనే వెల్లడించింది.
2. ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్ కోసం గుర్తించినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
3. ప్రపంచబ్యాంకు డూయింగ్ బిజినెస్ రిపోర్టు (డీబీఆర్)–2020 ప్రకారం భారతదేశ ర్యాంకు 2014లో 142 ఉండగా 79 ర్యాంకులు మెరుగై 2019కి 63వ ర్యాంకుకు చేరుకుందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ తెలిపారు.
☛☛ Daily Current Affairs in Telugu: 2 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. కడప స్టీల్ ప్లాంట్‌కు రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా తదితర కీలక మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.650 కోట్లు కేటాయించింది.
5. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం కోసం అందించే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ సరుకుల నాణ్యతను నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
6. గత రెండు దశాబ్దాలుగా జర్నలిజంలో అందిస్తున్న ఉత్తమ సేవలకు సీనియర్ పాత్రికేయుడు నాగిళ్ల వెంకటేష్‌ను ‘భారత్ కే అన్మోల్’ జాతీయ అవార్డు వరించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 1 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
7. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో షూటింగ్ విభాగంలో ఇలవేనిల్ వలారివరన్–దివ్యాంశ్ సింగ్ పన్వర్ జోడీ రజతం, మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భగవతి భవాని యాదవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
8. ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 76 కేజీల విభాగంలో భారత అమ్మాయి సంజన స్వర్ణం సాధించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 31 జులై 2023 కరెంట్ అఫైర్స్