Skip to main content

Daily Current Affairs in Telugu: 16 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
Daily-Current-Affairs-in-Telugu
Daily Current Affairs in Telugu

1.  గుండెపోటు మరణాలు తగ్గించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎస్‌టీ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (స్టెమి) కార్యక్రమం మెద‌లుపెట్టింది.

2. సౌరగోళం రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో సీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా  ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.

☛☛ Daily Current Affairs in Telugu: 10 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

3. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 14న ప్రయోగించిన చంద్రయాన్‌–3 మిషన్‌ లూనార్‌ ఆర్బిట్‌ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 177 కిలోమీటర్లు, దూరంగా 150 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది.

4. పోలీస్‌శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ ఆపరేషన్స్‌ అడిషనల్‌ డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్‌లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్‌ పతకాలు దక్కాయి.

☛☛ Daily Current Affairs in Telugu: 9 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

5. పాకిస్తాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వరుల్‌ హక్‌ కకర్‌ ఆగ‌స్టు 14న  పదవీ ప్రమాణం చేశారు.

6. ఏపీ మారిటైమ్‌ బోర్డు జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్లను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దనున్నారు.

7. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు.  

☛☛ Daily Current Affairs in Telugu: 8 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 17 Aug 2023 10:43AM

Photo Stories