President police Medals: పోలీస్‌శాఖలో విశిష్ట సేవలకు రాష్ట్రపతి పతకాలు
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు ఆగస్టు14 కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి.
AP High Court CJ: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్
విజయ్‌కుమార్:
తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు.
రమణకుమార్:
రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు.
కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్‌కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి.
LIC New MD: ఎల్‌ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి
నలుగురు జైలు అధికారులకు కూడా...
నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్‌వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు.
జహీరాబాద్ ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మ్యాన్ శ్రీనివాస్‌కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది.
హోంగార్డులు కె.సుందర్‌లాల్, చీర్ల కృష్ణ సాగర్‌లకు హోమ్‌గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్‌పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు.